గోపీచంద్‌.. ఏడోసారి

  • IndiaGlitz, [Monday,July 02 2018]

‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ తర్వాత ‘జయం’, ‘నిజం’ సినిమాలలో విలన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అనంతరం ‘యజ్ఞం’ లాంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో యాక్షన్ హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. ఇదిలా ఉంటే.. ‘రణం’ (అమ్మ రాజశేఖర్), ‘లక్ష్యం’ (శ్రీవాస్), ‘శౌర్యం’ (శివ), ‘వాంటెడ్’ (బి.వి.ఎస్.రవి), ‘జిల్’ (రాధాకృష్ణ కుమార్) లాంటి సినిమాలను కొత్త దర్శకులతో చేసి సింహభాగం విజయాలను అందుకున్న ఈ యాక్షన్ హీరో.. సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) ‘పంతం’ సినిమాని కూడా నూతన దర్శకుడు కె.చక్రవర్తి (చక్రి) తెరకెక్కించడం విశేషం. ఇదే క్రమంలో ఏడో సారి ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు గోపీచంద్.

ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవ‌ల‌ కుమార్ అనే దర్శకుడు గోపిచంద్‌ను కలిసి ఓ పూర్తి స్థాయి ప్రేమకథను వినిపించారు. ఆ కథ తన ఇమేజ్‌కు, వయసుకు తగ్గట్టుగా ఉండడంతో వెంటనే ఒప్పుకున్న‌ట్టు స్వయంగా గోపీచంద్ ప్రకటించడం విశేషం. గ‌తంలో గోపీచంద్‌తో ‘సాహ‌సం’ సినిమాని నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు. మరి ఇంతవరకు అందరి కొత్త దర్శకులతో యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన ఈ యాక్షన్ హీరో.. ఇప్పుడు దానికి భిన్నంగా తొలిసారి ఓ లవ్ స్టొరీని చేస్తున్నారంటే ఈ కథలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని తెలుస్తోంది.

More News

అంద‌రినీ మెప్పించే ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'తేజ్ ఐ ల‌వ్ యు' - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

త‌మ‌న్‌కు ఈ సారి కూడా ప్ల‌స్ అవుతుందా?

బృందావ‌నం, దూకుడు, మ‌హానుభావుడు.. యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ మూడు చిత్రాల‌కూ ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది.

ఫ్యామిలీ స‌బ్జెక్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఇప్ప‌టివ‌ర‌కు యువ‌త‌నే టార్గెట్ చేసుకున్న సినిమాల్లో.. క‌థానాయ‌కుడిగా న‌టించారు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌,

'సాక్ష్యం' మ‌ళ్ళీ వాయిదా?

అల్లుడు శీనుతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. ఆ త‌రువాత స్పీడున్నోడు, జ‌య‌జానకి నాయ‌క చిత్రాల్లో న‌టించారు.

'పంతం' ప్రీ రిలీజ్ వేడుక‌

గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.