వినాయక్ దర్శకత్వంలో గోపీచంద్.....

  • IndiaGlitz, [Wednesday,November 09 2016]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150తో బిజీగా ఉన్నాడు. సినిమా సంక్రాంతి బ‌రిలోకి దిగ‌నుంది. ఈ సినిమా కాగానే వినాయ‌క్ ఏ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడో ఇంకా క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వినాయ‌క్ గోపీచంద్‌ను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి గోపీచంద్‌తో సినిమా చేయ‌డానికి డేట్స్ తీసుకున్నాడ‌ట‌. ఈ సినిమాను వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే వినాయ‌క్‌, గోపీచంద్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.

More News

ప్రాఫిట్ లో భేతాళుడు....

నకిలీ,డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడుతో కమర్షియల్గా సెన్సేషనల్ సక్సెస్ ను అందుకున్నాడు.

100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఈవారం సినిమాలు వాయిదా..?

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఈనెల 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సందీప్ కిషన్ - మెహరీన్ కౌర్ జంటగా సుసీంధరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం!

2013లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న 'స్వామి రారా' తో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యువ ప్రతిభాశాలి,'లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ పాటలు మార్కెట్లోకి విడుదల

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో,స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో