'విన్నర్ ' తేజు రేంజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళే చిత్రమవుతుంది - గోపీచంద్

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'విన్న‌ర్‌'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌లవుతుంది.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మాట్లాడుతూ ....
'విన్న‌ర్‌' టైటిల్ గురించి...
- సినిమా టైటిల్ విన్నర్'. అంటే హీరో విన్నర్ అవడానికి ఎలాంటి జర్నీ చేశాడు. ఆ జర్నీలో అతను పడ్డ కష్టాలేంటి, కిందపడి త‌న స‌మ‌స్య‌ల‌ను దాటుకుని విన్న‌ర్‌గా ఎలా మారడానేదే సినిమా. అందుకనే సినిమాకు విన్న‌ర్ అనే టైటిల్‌ను పెట్టాం.
హీరో క్యార‌క్ట‌రైజేష‌న్‌....
- హీరోకి గుర్రాలన్నా, రేసులన్నా, తండ్రన్నా అస్సలు పడదు. అలాంటి హీరో చివరకు తండ్రి కోసం, ప్రేమ కోసం ఎలాంటి పోరాటం చేస్తాడు అనేదే నైపథ్యం. తేజ్ తండ్రిగా జగపతిబాబు నటించారు. వాళ్ళిద్దరికీ మధ్య వచ్చే సీన్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి.
క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌..
- 'విన్న‌ర్‌' ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ఇందులో మంచి యాక్షన్ సన్నివేశాలు, కామెడీతో పాటు కదిలించే ఎమోషన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్సుకు బాగా కనెక్టవుతుంది.
హైలైట్స్‌...
- సినిమా మొదలైన దగ్గర్నుంచి ఎండింగ్ వరకు చాలా ఎగ్జైటింగా సాగుతుంది. చివ‌రి 20 నిమిషాలు హార్స్ రేసింగ్ స‌న్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్ కు చాలా బాగుంటుంది. సింగం సుజాత పాత్రలో పృథ్వి, పీటర్ హైన్స్ క్యారెక్టర్లో అలీ, హీరో ఫ్రెండ్ పద్మగా వెన్నెల కిశోర్ ల కామెడీ బాగా నవ్విస్తుంది. ఎక్కడెక్కడ కామెడీ ఉండాలో అక్కడ ఉండేలా చూసుకున్నాం.
హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి....
- సాయిధ‌ర‌మ్ తేజ్‌లో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ. యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్సులు, హార్స్ రేస్ వంటి వాటిలో చాలా బాగా నటించాడు. వీటితో పాటు తేజు కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ల సీన్లలో అద్భుతంగా నటించాడు. 'విన్న‌ర్‌' సినిమా హీరోగా తేజు రేంజ్‌ను పెంచుతుంది..
దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం...
- హార్స్ రేసింగ్ స‌న్నివేశాలు షూట్ చేయాల‌నుకున్న‌ప్పుడు లోకేష‌న్స్ కోసం చాలా చోట్ల తిరిగాం. చివ‌ర‌కు ట‌ర్కీలో షూట్ చేద్దామ‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ట‌ర్కీ గుర్రాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. మొత్తం పది గుర్రాల్ని ఫైనల్ రేస్ లో వాడాం. సన్నివేశాలు చాలా బాగా వచ్చాయ్. హాలీవుడ్ స్టంట్ కోరియేగ్రాఫర్ దీని కోసం పని చేశారు. ఆయన గతంలో గ్లాడియేటర్, ఫాస్ట అండ్ ఫ్యూరియస్, ట్రాయ్' సినిమాలకి పని చేశారు.
రిస్క్ త‌ప్ప‌లేదు...
- హార్స్ రైడింగ్‌పై సినిమా మొత్తం ఉంటుందనుకోవ‌డానికి బాగానే ఉంటుంది. కానీ తీయ‌డం చాలాక‌ష్టం. షూట్ చేయ‌డం రిస్కుతో కూడుకున్న ప‌నే. ముఖ్యంగా తేజ్ వాడిన గుర్రానికి సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా హాలీవుడ్ సినిమాల్లో నటించింది. వెల్ ట్రైన్డ్ హార్స్. యాక్షన్ అంటే పరిగెడుతుంది, కట్ చెప్తే ఆగిపోతుంది. మా యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా తేజ్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. ఆయనకు ఆ గుర్రాలు బాగా అలవాటు. ఆయన వల్లే ఆ గుర్రాలతో షూట్ చేయగలిగాం.
త‌న‌తో రెండోసారి...
-పండ‌గ చేస్కో త‌ర్వాత‌ రకుల్ ప్రీత్ తో పని చేయడం ఇది రెండోసారి. ఆమె చాలా డేడికేటెడ్ గా వర్క్ చేస్తుంది. అనుష్క ఎంత అంకితభావంతో పని చేస్తారో రకుల్ కూడా అలాగే పని చేస్తుంది. ఈ సినిమాలో ఆమె ఒక అథ్లెట్ గా కనిపిస్తుంది. ఎప్పటికైనా రన్నింగ్ రేస్ లో మెడల్ సంపాదించాలని అనుకునే పాత్ర. సాధారణంగానే రకుల్ కు ఫిటెన్స్ మీద ఎక్కువ శ్రద్ద కనుక ఈ పాత్రలో సులభంగా ఇమిడిపోయింది.
అందుకే గ్యాప్‌...
- ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమా అనడం నాకు నచ్చదు. ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెడతాను. మనల్ని నమ్మి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా డబ్బు పెడతారు. వాళ్లకు లాభాలు వచ్చేలా చూడాలి. సినిమా ఫ్లాప్ కాకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా మొదలుపెడతాను.అందుకే ఆల‌స్య‌మ‌వుతుంది.
అన‌సూయ స్పెష‌ల్ సాంగ్‌...
- స్పెషల్ సాంగ్ అనుకున్నప్పుడు అనసూయ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎందుకంటే ఆమె టీవీ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. కనుక అది ప్లస్ అవుతుందని భావించి ఆమెను అడిగాం. మొదట ఆమె ఒప్పుకోలేదు. తర్వాత పాట విన్నాక చేస్తానన్నారు. ఇక సుమతో పాడించడం థమన్ ఐడియా. నేను కూడా సరే అన్నాను. పాట పూర్తయ్యాక వింటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు అనిపించింది.

More News

'కేరాఫ్ గోదావరి' పది నిమిషాల సినిమా విడుదల

"క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్" అనే వెరైటీ ట్యాగ్ లైన్ తో రూపొందిన చిత్రం "కేరాఫ్ గోదావరి". రోహిత్.ఎస్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూవీస్ సమర్పణలో ఆర్.ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్-బొమ్మన ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తూము రామారావు(బాబాయ్)-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వెంకీ టైటిల్ తో శర్వానంద్

రన్రాజారన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ప్రెస్ రాజా వంటి సూపర్హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అక్ష కథానాయికలుగా,

సీనియర్ డైరెక్టర్ తో సుమంత్ అశ్విన్

ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్గా సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు ఇప్పుడు హిట్ మూవీస్ లేక కామ్ అయ్యారు. ఈయన తనయుడు సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ సినిమా తెరంగేట్రం చేసి వరుస సినిమాలు చేశాడు.

'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది

'కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభమైన మా 'వైశాఖం' దిగ్విజయంగా శివరాత్రికి పూర్తయింది'

నాని, దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం

వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.