గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌' రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Friday,September 22 2017]

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌ర్ 27న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. " హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్ వేల్యూస్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్‌గారి కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ అవుతుంది. గోపీచంద్‌గారు డేడికేష‌న్‌, స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేయ‌గ‌లిగాం. ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజ‌న్ చిత్రాన్ని రూపొందించాం. జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు.

ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. సీజీ వ‌ర్క్స్ అద్భుతంగా చేశాం. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేసి, సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్ 27న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ.

More News

సాగర్ దర్శకత్వంలో నితీష్ రెడ్డి హీరోగా 'ప్రభాస్ ' చిత్రం ప్రారంభం.

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న"ప్రభాస్"

'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదల

గుడ్ అంటే మంచి,బ్యాడ్ అంటే చెడు,అగ్లీ అంటే తింగరితనం అనే పదాలు మనకు తెలిసిందే.

'అదిరింది'.. క‌మ‌ల్ సినిమానా?

విజ‌య్ మూడు పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం మెర్స‌ల్‌.. తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎంత పని చేశావ్ సమంత...

చెన్నై సొగసరి సమంత మంచి నటి అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

యువిక్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా 'హ్యాపీవెడ్డింగ్'

వ‌రుస‌  విజ‌యాలు సాధిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్‌'.