క్రిస్మస్ కానుకగా గోపీచంద్ , రవికుమార్ చౌదరి చిత్రం

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

'యజ్ఞం'తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, ఏయస్ రవికుమార్ చౌదర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. భవ్య క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ తో ఈ చిత్రం 70 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా...

ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ''ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. గోపీచంద్ మార్క్ యాక్షన్, రవికుమార్ చౌదరి మార్క్ ఎమోషన్ కూడా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు చిత్రంలో అత్యంత భారీ తారాగణం ఉంటుంది. అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలుంటాయి. వాటిలో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - ''గోపీచంద్ తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం'కి పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. గోపీచంద్ కెరీర్లో భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. అన్ని పాత్రలకూ తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఓ కీలక పాత్రను మాలయాళ నటుడు దేవన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్న తెలుగు సినిమా ఇది.

ఒక సూపర్ హిట్ మూవీకి కావల్సిన అంశాలతో రూపొందుతున్న చిత్రం గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పథ్వీ, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, నాజర్, ముఖేష్ రుషి, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: కోన వెంకట్-గోపీ మోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: వివేక్ అన్నామలై.

More News

'కంచె' ఓవర్ సీస్ హక్కులను...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

క్లాసిక్ సితార కాదంటున్నారు మరి...

జీనస్ ఫిలింస్ బ్యానర్పై సురేంద్ర జి.ఎల్ దర్శకత్వంలో రవికుమార్ డి.ఎస్. నిర్మించే చిత్రం సితార. రవిబాబు, రవనీత్ కౌర్, సుమన్ ప్రధానపాత్రల్లో నటించారు.

'కృష్ణాష్టమి' టీజర్ రివ్యూ...

కమెడియన్ గా కెరీర్ ను స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ సునీల్.

మెగా వార్ లో...విజేత ఎవరు..?

మెగా హీరోలు మధ్య వార్ మొదలైంది.ఇంతకీ మెగా హీరోల మధ్య వార్ ఏమిటనుకుంటున్నారా..?వారం గ్యాప్ తో ముగ్గురు మెగా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

శ్రీమంతుడు అర్ధశతదినోత్సవం ఎక్కడ...?

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.