Cylinder Scheme:రూ.500కే సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చి ఆరు గ్యారంటీల హామీలు. ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10లక్షలకు పెంపు హామీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీలపై మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయాలంటే ఏటా 3 నుంచి 4వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు తేల్చారు. వంద రోజుల్లోనే ఈ హామీని నెరవేరుస్తామని దీనికోసం అధికారులతో కసరత్తు చేస్తున్నానని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

దీంతో పాటు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పొందటం కోసం మహిళలు ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయాలు, ఈసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో దరఖాస్తుల కోసం కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మహిళల్లో ఫుల్ క్రేజ్ తెచ్చి పెట్టాయి.

More News

Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ సర్‌ప్రైజ్‌.. ఎమోషనలైన శివాజీ, ప్రియాంక.. యావర్‌తో కలిసిపోయిన అర్జున్

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

Vijayashanthi:కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే విమర్శలకు విజయశాంతి కౌంటర్

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Devil:రజినీకాంత్ బర్త్‌డే ట్రీట్.. కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.

Rajasthan CM:రాజస్థాన్‌ సీఎంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. బీజేపీ సంచలన నిర్ణయం..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 9 రోజుల తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

KCR:మీకు దండం పెడతా.. పరామర్శకు ఎవరూ రావొద్దు: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.