close
Choose your channels

డోంట్ వర్రీ.. ‘మిడత’ను ఇలా తరిమేయండి..!!

Friday, May 29, 2020 • తెలుగు Comments

డోంట్ వర్రీ.. ‘మిడత’ను ఇలా తరిమేయండి..!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ముప్పుతో యావత్ ప్రపంచం కకావికలం అవుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మరోవైపు మరణాల సంఖ్య, అనుమానితుల సంఖ్య పెరిగిపోతుండటంతో జనాలు భయంతో బిక్కి బిక్కిమంటున్నారు. అసలు ఈ మహమ్మారిని చంపే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలకు మరో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అదే ‘మిడత’.. అబ్బే మిడతే కదా అని సింపుల్ తీసేస్తున్నారేమో.. వామ్మో ఇది మామూలు మిడత కాదండోయ్.. ఒక్కసారి ఈ దండు వచ్చి పడిందో ఇక పంటలు సర్వ నాశనమే. అసలు ఈ విలన్ మిడత సంగతేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పుట్టు పుర్వోత్తరాలు..

అప్పుడెప్పుడో 27 ఏళ్లకు ముందు మిడత తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. గత ఏడాది తూర్పు ఆఫ్రికాలో భారీగా పుట్టుకొచ్చిన మిడతలు అక్కడ్నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్‌కు చేరాయి. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఈ మిడతల దండు ఇప్పటికే ఇండియాకు చేరుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని వేల ఎకరాల పంటలను నాశనం చేశాయని సమాచారం. అయితే.. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత సమీపంలో ఈ దండు ఉందని తెలుస్తోంది. పది ఏనుగులు, 25 ఒంటెలు, లేదా 2500 మంది మనుషులు ఒక్కరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నపాటి మిడతల గుంపు ఒక్కసారిగా తినేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కేవలం మూడే మూడు నెలల్లో మిడతలు వాటి సంతతిని 20 రెట్లు వరకు పెంచుకుంటాయి. మరీ ముఖ్యంగా ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవి. ఒక చదరపు కిలో మీటర్ దండులో 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. అవన్నీ గాలి వేగాన్ని బట్టి రోజుకు సుమారు 135 నుంచి 150 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంటాయి. అవి కేవలం 90 రోజుల్లో బతికినప్పటికీ ఆ లోపే ఒక్కో మిడత 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు 45 రోజుల్లో పెరిగి పెద్దవై, తర్వాతి నెల రోజుల్లో అవీ గుడ్లు పెడతాయి. మిడతలకు ఇదే తినాలనే నియమం లేదు. పచ్చగా కళకళలాడే ఏ మొక్కైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు 35 వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో లాగించగలవు. అవి వాలిన చోట పచ్చ దనం కనుమరుగేనని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులే ఇందుకు కారఫమని తరుచూగా తుఫాన్లు చెలరేగడం వీటి సంఖ్య భారీగా పెరిగేందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఎలాగైనా తరిమేయాలని..!

ఈ దండును ఎలాగైనా సరే పారదోలాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇ:దుకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా వేశారు. ఈ క్రమంలో ఫైరింజన్లు, జెట్టింగ్ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా అధికారులు సిద్ధంగా ఉంచారని స్పష్టం చేశారు. కాగా.. అసలు ఆ మిడతల దండు ఎటు వెళ్తోంది..? గాలి వాటం ప్రకారం పయనిస్తే ఏ రాష్ట్రం వైపు వస్తాయి..? అనేదానిపై హెలికాఫ్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తామన్నారు. గురువారం నాటికి మిడతలు ఆంధ్రప్రదేశ్‌‌లోని అనంతపురం జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని రాయదుర్గంలో వందల సంఖ్యల్లో ఈ రాకాసి మిడతలు క్షణాల్లో జిల్లేడి చెట్టు ఆకులను తినేయడం చూసి స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మిడత తీవ్రతను అరికట్టడానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

మిడతలను ‘మట్టి’తో చంపేయొచ్చు..!

మిడతలను ‘మట్టి’తోనే చంపేయొచ్చని వీర రాఘవరెడ్డి అనే ఓ ప్రముఖుడు రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆయన ఏం రాశారో ఇప్పుడు చూద్దాం. ‘మీ పొలంలో 2 అడుగుల గుంత తీసి అక్కడి నుంచి 4 అడుగుల లోతు వ‌ర‌కు ఉన్న మ‌ట్టిని (ఈ మ‌ట్టిలో బంక ఎక్కువ‌గా ఉంటుంది) తీసి 200 లీట‌ర్ల నీటికి 30-40 కేజీల త‌వ్విన మ‌ట్టిని క‌లిపి ప‌ది నిమిషాల పాటు క‌లియ‌తిప్పాలి. త‌ర్వాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి పొలంపై పిచికారీ చేయాలి. నీరు బురదగా ఉంది పంటకు ఇబ్బంది అవుతుందేమో..? అనే భయం అక్కర్లేదు. అలా మట్టి ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న అధిక ఎండల నుండి కూడా మొక్కలు తట్టుకుంటాయి. నీటి డ్రమ్ము అడుగున మిగిలిన మట్టిద్రావణాన్ని చెట్ల మొదళ్ల వద్ద వెయ్యండి. బుర‌ద మ‌ట్టి ధాన్యంపై పేరుకుపోవ‌డం వ‌ల్ల మిడ‌త‌లు వాటిని తిన‌లేవు.. ఎందుకంటే మిడ‌త‌ల‌కు కాలేయం ఉండ‌దు. మ‌ట్టి జీర్ణం కాదు.. అది తిన్న కాసేప‌టికే చ‌నిపోతాయి. అలా బురద ఉన్న పంటవైపు మిడతలు రావు. దీని మూలంగా మనకు ఖర్చయ్యేది కేవలం మన శ్రమ మాత్రమే. మిడతల బెడద తీరిన తర్వాత ఒక్కసారి నీటిని పిచికారి చేస్తే మొక్కలపై ఉన్న బురద పోతుంది. కాబట్టి  పంటలపై రోజువిడిచి రోజు 4-5సార్లు ఇలా బురద నీటిని పిచికారి చేస్తే మన పంటని రక్షించుకోవచ్చు’ అని రాఘవరెడ్డి పోస్ట్ చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఫోన్ చేయొచ్చని 812 57 99904 అనే నంబర్‌ కూడా ఇచ్చారాయన.

డోంట్ వర్రీ.. ‘మిడత’ను ఇలా తరిమేయండి..!!

డిజే సౌండ్స్ చేస్తే పరారే..!

కాగా రాజస్థాన్ లాంటి మిడతల బాధిత రాష్ట్రంలో.. దాడి మొదలైన ప్రాంతాల్లో కొందరు డీజే సౌండు పెట్టి వాటిని బెదరగొట్టడంతో అవి పరుగులు తీస్తున్నాయి. ఇందుకు సంబంధిచిన వీడియోలు సైతం నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. పెద్ద ఎత్తున సైరెన్ మోగించడంతో యూపీలో మిడతలు పంట పొలాల నుంచి వెళ్లిపోతున్న వీడియోను ఝాన్సీ పోలీస్ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాదు వీటిని తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద శబ్దాలు కూడా చేయొచ్చన్నారు. ఇదిలా ఉంటే.. ఖాళీ డబ్బాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పెద్ద శబ్ధాలు చేస్తే మిడతలు ఎక్కడికక్కడ చెదిరిపోతాయి. అంతకాకుండా ప్రతి 15 లీటర్ల నీటిలో 45 మిల్లీలీటర్ల వేపనూనేను కలిపి పైరుపై చల్లితే ఇవి తినలేవు.

మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు..

కాగా.. ఈ మిడతల గుంపుతో తెలంగాణ రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ చెబుతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. మహారాష్ట్రలోని విదర్భ వరకు మిడతల గుండు వచ్చిందన్నారు. గాలిని బట్టి మిడతల గుంపు తెలంగాణ వైపు రావొచ్చు లేదా..? దిశను మార్చుకుని ఛత్తీస్‌గఢ్ వైపుకు వెళ్ళొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర బోర్డర్ జిల్లాల రైతులను అప్రమత్తంగా ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. పాత ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులు ఆందోళన చెందాల్సి‌న అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డబ్బాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై శబ్ధాలు చేసి మిడతల గుంపును తరిమికొట్టొచ్చన్నారు. నీటిలో వేప నూనెను కలిపి ఉదయం వేళలో పంటపై పిచికారీ చేస్తే మిడతలు పంటను తినలేవన్నారు. వాతావరణంలోని మార్పుల కారణంగానే 27ఏళ్ళ తర్వాత మిడతల బెడద వచ్చిందన్నారు. ఆహారం, పచ్చదనం ఉన్నచోటకి మిడతల గుంపు వస్తుందన్నారు. జనావాసాల్లోకి సైతం మిడతల గుంపు వచ్చే ఆవకాశముందని.. అయితే మిడతల వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఖాళీ రోడ్లపైన సాధారణంగా మిడతలు వాలి విశ్రాంతి తీసుకుంటాయన్నారు.

ముందే పసిగట్టిన దర్శకులు..!

ఇదిలా ఉంటే.. సూర్య హీరోగా.. దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన ‘బందోబస్త్’ సినిమాలో అసలు మిడత బెడద అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ సినిమాలో చూపించినట్లుగానే అచ్చంగా ఇప్పుడు మిడతలన్నీ ఇండియాలోకి వచ్చేస్తున్నాయి. పొలాలతో పాటు ఇళ్లపైకి కూడా వచ్చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఈ మిడతలు అన్నీ వచ్చి పంట పొలాలను నాశనం చేస్తాయి. ఇది కూడా ఓ రకంగా పాకిస్తాన్ తీసే దొంగ దెబ్బే.. అలా ఈ మిడతల బెడదను మన దర్శకులు ముందే పసిగట్టేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz