మహా ‘పీఠం’ శివసేనదే.. ‘సీఎం’గా కూర్చునేదెవరో..!?

  • IndiaGlitz, [Monday,November 11 2019]

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’పై చిక్కుముడులన్నీ వీడిపోయాయి. ఇప్పటి వరకూ బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ.. చివరికి సీన్ రివర్స్ కావడంతో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. 50:50 కి బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో మిత్రపక్షం నుంచి శివసేనలు విడిపోయింది. ఈక్రమంలో బీజేపీ తమకు బలం లేదని సర్కార్‌ను ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు తేల్చిచెప్పింది. దీంతో శివసేన కాసింత చిక్కుల్లో పడినట్లైంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ సాయం కోరింది శివసేన. దీంతో ‘మహా'లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్​కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. పరిస్థితులన్నీ చక్కబడటంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన వీడిందని చెప్పుకోవచ్చు.

శివసేన-ఎన్సీపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై ఇంకా తుది ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు మద్దతు లేఖను ఫ్యాక్స్ ద్వారా రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ పంపింది. సోమవారం మధ్యాహ్నం పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సోనియాగాంధీ ఫలానా రూట్‌లో ముందుకెళ్లండని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నేతలు రాజ్‌భవన్‌ వెళ్లారు.

కాగా ప్రస్తుతం శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే గవర్నర్‌ను కలిసిన తర్వాత ఫలానా రోజున ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని ఆయన ఆహ్వానిస్తారు. అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరి సీఎం పీఠంపై శివసేన నుంచి ఆదిత్య కూర్చుంటారా..? లేకుంటే శరద్ పవార్ కూర్చుంటారా..? లేకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరైనా కూర్చుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు మంత్రి పదవుల పంపకంపై కూడా ఈ మూడు పార్టీల్లో అనే చిక్కుముడులు ఉన్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్తాయో.. ఎవర్ని పీఠంపై కూర్చుబెడతాయో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్‌ వ్యాఖ్యలపై స్పందించకండి.. జనసేన నేతలకు పిలుపు!

‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?.

విజయ్‌చందర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి

టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయ్ చందర్‌ను

లతా మంగేష్కర్‌కి అస్వస్థత

ప్రముఖ బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌(90) అనారోగ్యానికి గురయ్యారు.

'నమస్తే నేస్తమా' లో హాస్యంతో పాటు ఎమోషనల్‌ ఉండే క్యారెక్టర్ చేశా - బ్రహ్మానందం

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు.

‘RRR’ రిలీజ్‌ ప్లాన్‌ మారుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘RRR’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో