ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

  • IndiaGlitz, [Friday,October 18 2019]

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం.. కార్మికులు కూడా సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి!

‘ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం పట్టువిడకపోవడంతో ప్రజా రవాణా మందగించింది. ఆర్టీసీ సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర యంత్రాంగం చూడాలి. సమ్మె కారణంగా సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు రవాణా శాఖ కార్యదర్శి తీసుకోవాలి. సమ్మెపై పలు ఫిర్యాదులు అందాయి’ అని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్షనేతలు, ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు తమిళిసైను కలిసి ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. కాగా ఇందుకు స్పందించిన రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ.. సమ్మెపై అన్ని చర్యలు తీసుకున్నామని.. సామాన్యులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా చూస్తున్నామని గవర్నర్‌కు శర్మ నిశితంగా తెలిపారు.

More News

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు,

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు..

బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి.

'విజిల్‌' అక్టోబ‌ర్ 25న రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌`.