close
Choose your channels

Gowri Kalyana Vaibhogame: ఒక్క పాట.. ఆరుగురు సింగర్స్.. దుమ్మురేపుతోన్న ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ సాంగ్

Tuesday, September 20, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మనదేశంలో పెళ్లి పాటకు వుండే డిమాండే వేరు. వివిధ సినిమాల్లో సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు పెళ్లి వేడుకల్లో, పెళ్లి తర్వాత చేసే వీడియోగ్రాఫీల్లోనూ మారుమోగుతూ వుంటాయి. ‘‘కళ్యాణ వైభోగమే’’, ‘‘రాళ్లల్లో ఇసుకల్లో’’, ‘‘నిన్నే పెళ్లాడేస్తానంటూ’’, ‘‘అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి’’ , ‘‘శ్రీరస్తు శుభమస్తు’’ వంటి పాటలు ఇప్పటికీ తెలుగునాట పాపులర్. అయితే మారుతోన్న కాలానికి తగ్గట్లుగా సినిమా పాటల్లోని సాహిత్యం, సంగీతం కూడా మారుతున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న పాటలను గాయనీ గాయకులు సంయుక్తంగా కానీ, విడివిడిగా కానీ పాడినవి. మరి ఒకే పాటను ఆరుగురు స్టార్ సింగర్లు పాడితే.

పెళ్లి విశిష్టతను తెలిపేలా సాహిత్యం.. కలర్‌ఫుల్ పిక్చరైజేషన్:

ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులైన.. సాకేత్, సత్య యామిని, మనీషా ఈరబత్తిని, సమీరా భరద్వాజ్, అనుదీప్ , గీతా మాధురిలు కలిసి పాడిన ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ అనే సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ టెక్స్‌టైల్స్ సంస్థ ‘గౌరీ సిగ్నేచర్స్’ కోసం ఈ పాటను రూపొందించారు. సాహిత్యం, సంగీతంతో పాటు విజ్యువల్స్‌ కూడా కలర్‌ఫుల్‌గా వుండటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఈ పాటకు విన్ను ముత్యాల దర్శకత్వం వహించగా.. కేశవ్ కిరణ్ సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. గత నెల 27న యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సాంగ్‌లో వివాహ బంధం , పట్టువస్త్రాలు, తాళిబొట్టు వరకు అన్నింటి విశిష్టతను తెలియజేస్తూ.. 4 నిమిషాల పాటు ఆలపించారు. ఇకపోతే.. గౌరీ కళ్యాణం సింగింగ్ ఛాలెంజ్ కాంటెస్ట్ పేరుతో నిర్వాహకులు ఓ పోటీ కూడా పెట్టారు. మరి ఈ పోటీలో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోండి.

ఆరుగురు సింగర్స్‌కి భారీ ఫ్యాన్ బేస్:

ఇకపోతే.. ఇందులో పాల్గొన్న ఆరుగురు టాప్ సింగర్స్‌ ఇప్పటికే వందలాది పాటలు , మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. వీరికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వుంది. అలాతే వీరిని అమితంగా ఇష్టపడే అభిమానులు కూడా లక్షల్లో తవున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.