Gowri Kalyana Vaibhogame: ఒక్క పాట.. ఆరుగురు సింగర్స్.. దుమ్మురేపుతోన్న ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ సాంగ్

  • IndiaGlitz, [Tuesday,September 20 2022]

మనదేశంలో పెళ్లి పాటకు వుండే డిమాండే వేరు. వివిధ సినిమాల్లో సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు పెళ్లి వేడుకల్లో, పెళ్లి తర్వాత చేసే వీడియోగ్రాఫీల్లోనూ మారుమోగుతూ వుంటాయి. ‘‘కళ్యాణ వైభోగమే’’, ‘‘రాళ్లల్లో ఇసుకల్లో’’, ‘‘నిన్నే పెళ్లాడేస్తానంటూ’’, ‘‘అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి’’ , ‘‘శ్రీరస్తు శుభమస్తు’’ వంటి పాటలు ఇప్పటికీ తెలుగునాట పాపులర్. అయితే మారుతోన్న కాలానికి తగ్గట్లుగా సినిమా పాటల్లోని సాహిత్యం, సంగీతం కూడా మారుతున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న పాటలను గాయనీ గాయకులు సంయుక్తంగా కానీ, విడివిడిగా కానీ పాడినవి. మరి ఒకే పాటను ఆరుగురు స్టార్ సింగర్లు పాడితే.

పెళ్లి విశిష్టతను తెలిపేలా సాహిత్యం.. కలర్‌ఫుల్ పిక్చరైజేషన్:

ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులైన.. సాకేత్, సత్య యామిని, మనీషా ఈరబత్తిని, సమీరా భరద్వాజ్, అనుదీప్ , గీతా మాధురిలు కలిసి పాడిన ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ అనే సాంగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ టెక్స్‌టైల్స్ సంస్థ ‘గౌరీ సిగ్నేచర్స్’ కోసం ఈ పాటను రూపొందించారు. సాహిత్యం, సంగీతంతో పాటు విజ్యువల్స్‌ కూడా కలర్‌ఫుల్‌గా వుండటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఈ పాటకు విన్ను ముత్యాల దర్శకత్వం వహించగా.. కేశవ్ కిరణ్ సాహిత్యం అందించారు. ఇప్పటికే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. గత నెల 27న యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సాంగ్‌లో వివాహ బంధం , పట్టువస్త్రాలు, తాళిబొట్టు వరకు అన్నింటి విశిష్టతను తెలియజేస్తూ.. 4 నిమిషాల పాటు ఆలపించారు. ఇకపోతే.. గౌరీ కళ్యాణం సింగింగ్ ఛాలెంజ్ కాంటెస్ట్ పేరుతో నిర్వాహకులు ఓ పోటీ కూడా పెట్టారు. మరి ఈ పోటీలో పాల్గొని మంచి బహుమతులు గెలుచుకోండి.

ఆరుగురు సింగర్స్‌కి భారీ ఫ్యాన్ బేస్:

ఇకపోతే.. ఇందులో పాల్గొన్న ఆరుగురు టాప్ సింగర్స్‌ ఇప్పటికే వందలాది పాటలు , మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. వీరికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వుంది. అలాతే వీరిని అమితంగా ఇష్టపడే అభిమానులు కూడా లక్షల్లో తవున్నారు.

More News

'అహింస' ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట విడుదల

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.

Naga Chaitanya: నాగ చైతన్య NC 22 షూటింగ్ ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది.

Ginna: 'జిన్నా' మూవీ నుండి 'గోలీ సోడా వే' పాట విడుదల

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న

BiggBoss: నాగ్‌ క్లాస్‌‌ బాగానే పనిచేసినట్లుంది.. నామినేషన్స్‌లో రోత రోత

బిగ్‌బాస్ 6 విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

డిసెంబర్ 2 , 2022 న 'సార్' విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్