అనురాగ్‌కశ్యప్‌కి పెరుగుతున్న మద్దతు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ఇండస్ట్రీ సెలబ్రిటీల నుండి మద్దతు దొరుకుతుంది. తాప్సీ ఇప్పటికే తన మద్దతును తెలియజేసింది. ఇప్పుడు ఈ విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, అనురాగ్‌ కశ్యప్‌ మాజీ భార్య, నటి కల్కి కొచ్లిన్‌ తమ మద్దతుని అనురాగ్‌కి తెలియజేశారు.

పరీక్షా సమయం..

కల్కొకొచ్లిన్‌ ఇన్‌స్టాలో అనురాగ్‌కి మద్దతుని తెలియజేస్తూ ఓ లెటర్‌ పోస్ట్‌ చేశారు. డియర్‌ అనురాగ్‌ ఇది పరీక్షా సమయం. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న పుకార్లను నమ్మకండి. నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తుంటారు. అవసరమైన సమయంలో ప్రేమను పంచే మనుషులే కాదు.. దయను చూపించే మనుషులు కూడా ఉంటారు. ధైర్యంగా ఉండండి. మీరు స్క్రిప్ట్‌లో మహిళల స్వేచ్చను కోరుతారు. మహిళల సమగ్రతకు ఎంతగానో సపోర్ట్‌ చేస్తారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మీరెంతో సపోర్ట్‌ చేస్తారనడానికి నేనే సాక్షిని. మన విడాలకు తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను పనిచేసేచోట అసౌకర్యానికి లోనైనప్పుడు మద్దతుగా నిలిచారు. మీ గౌరవంపై నిలబడండి.. ధైర్యంగా ఉండండి అన్నారు.

తను గురించి నేనలా వినలేదు కూడా...

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ట్విట్టర్‌ వేదికగా అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు. అనురాగ్‌ సున్నితమైన, ఎమోషనల్‌ పర్సన్‌. నాకు తను 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్లలో తనెవరినీ బాధపెట్టడం చూడలేదు.. సరికదా వినలేదు కూడా. కాబట్టి ప్రస్తుతం జరిగే విషయాల గురించి నేను స్పష్టంగా చెప్పలేను అన్నారు.

More News

నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ‘DSJ’ ‘దెయ్యంతో సహజీవనం...’ మూవీతో తెరంగేట్రం

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం...)

అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. రీసెట్‌గా గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

వేంకటేశ్వరునిపై కొడాలి నాని వ్యాఖ్యలపై శ్రీనివాసానంద కన్నీళ్లు..

వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి.

రైతులకు అండగా కార్తీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..

రైతుల ఆదుకునేందుకు హీరో కార్తీ నడుం బిగించారు. ఇది ఒక్క ఏడాదితో పోయేలా కాకుండా నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కీరవాణి అప్‌డేట్‌..!

రెండు వందలకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.