మార్చి 23న గులేబకావళి

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను.

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది.

ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది అని తెలిపారు. ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

More News

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు ,అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం.

'రాజరథం' లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

'రాజరథం' లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది.

'రాజుగాడు' టీజ‌ర్ అప్‌డేట్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్'.. ఇలా వరుసగా యూత్‌ఫుల్‌ సినిమాలతో యూత్‌కు బాగా దగ్గరైన హీరో రాజ్ తరుణ్.

ర‌జ‌నీ కోస‌మే ఒప్పుకున్నాడ‌ట‌

డైలాగులు చెప్ప‌డంలో త‌న‌కు తానే సాటి. ఆయ‌న‌ మాటలు పలికే శైలికి ప్రేక్షకలోకం దాసోహం అంటుంది. ఆయనే.. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పాటేకర్. ఈ నటుడు తొలిసారిగా 'కాలా' చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

రీమేక్ ప్లాన్‌లో సందీప్‌...

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. త‌ను న‌టిస్తున్న సినిమాలు తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంటాయి.