Download App

Guna 369 Review

కార్తికేయ... తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్‌ 100'తో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యువ హీరో. ఈయన రెండో చిత్రం 'హిప్పీ' బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా రాణించలేదు. తొలి రెండు చిత్రాలు లవ్‌ ఎంటర్‌టైనర్స్‌ సబ్జెక్స్‌నే ఎంచుకున్న కార్తికేయ మూడో చిత్రం 'గుణ 369'ని మాత్రం మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా ఎంచుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్‌ జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రమది. టీజర్‌, ట్రైలర్‌ చూసిన వాళ్లకు అందులో మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ పార్ట్‌ చూసి సినిమా గురువు బాటలోనే శిష్యుడు ప్రయాణించాడని అనుకున్నారు. మరి కార్తికేయను అర్జున్‌ జంధాల్య.. తన డెబ్యూ మూవీలో ఎలా ప్రెజంట్‌ చేశాడు? గురువు బోయపాటి స్లైల్లోనే సినిమాను తీశాడా? లేక తనదైన స్టయిల్లో తెరకెక్కించాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

ఒంగోలులో గద్దల గుంట రాధ(ఆదిత్య మీనన్‌) పేరు చెబితే అందరూ భయపడుతుంటారు. అతను ఎన్నో సెటిల్‌మెంట్స్‌, దందాలు చేస్తుంటాడు. గుణ(కార్తికేయ)కు తన ఫ్యామిలీ అంటే ప్రాణం. ఓ క్వారిలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. ఓ సందర్భంలో గీత(అనఘ)తో ఎర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో గుణ స్నేహితుడు(మహేశ్‌)కి తెలిసిన ఫ్రెండ్‌, ఓ గొడవలో గద్దల గుంట రాధ ఎవరో తెలియక అతన్ని కొడతారు. నిజం తెలిసిన తర్వాత అందరూ భయపడతారు. రాధ తమను ఎక్కడ చంపేస్తాడోనని భయపడుతుంటారు. రాధతో గుణకి చిన్న పరిచయం ఉంటుంది. ఆ కారణంగా రాధను మీటింగ్‌ ఏర్పాటు చేస్తే క్షమించమని వేడుకుంటామని అంటారు. స్నేహితుల కోసం రాధతో, కుర్ర గ్యాంగ్‌కి మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు గుణ. కానీ అక్కడకొచ్చిన కుర్రాళ్లు రాధను చంపేసి వెళ్లిపోతారు. పోలీసులు గుణని అరెస్ట్‌ చేస్తారు. మూడు నెలలు తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన గుణకి తన లవర్‌ గీత, తండ్రి మరొకరిని పెళ్లి చేసుకోమన్నాడని, అది ఇష్టం లేక ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఈలోపు గుణ, అతని కుటుంబంపై రాధ మనుషుల దాడి చేస్తారు. ఒక వారంలో రాధను చంపిన వారి ఆచూకీ చెప్పకపోతే కుటంబంతో సహా గుణని చంపేస్తామని రాధ తల్లి వార్నింగ్‌ ఇస్తుంది. తన కుంటుంబ కోసం రాధను చంపిన హంతకులను వేటాడే ప్రయత్నం చేస్తాడు గుణ. ఆ క్రమంలో అతనికి కొన్ని షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. అవేంటి? తన హత్యానేరంలో ఇరించిందెవరు? అసలు గీత మరణానికి కారణం ఎవరు? ఈ సమస్యలకు గుణ చివర్లో ఇచ్చే తీర్పు ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

తొలి రెండు సినిమాలను లవ్‌ ఎంటర్‌టైనర్స్‌ కాన్సెప్ట్‌లతోనే చేసిన కార్తికేయ ఈసారి మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. ఫ్యూచర్‌లో తాను కమర్షియల్‌ సినిమాలు కూడా చేయగలనని దర్శకులకు హింట్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గొడవ పడితే ఏం వస్తుంది? గొడవ తప్ప.. అనుకునే ఓ యువకుడు, తన ఫ్యామిలీకి, సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలకు చివరల్లో కరుకైన సమాధానం ఇచ్చే గుణ అనే రెండు షేడ్స్‌ ఉన్న పాత్రను కార్తికేయ అద్భుతంగా క్యారీ చేశాడు. ఫస్టాఫ్‌ అంతా అతని పాత్ర ఫ్యామిలీ కోసం తాపత్రయ పడే యువకుడిగా ఉంటుంది. రెండో హాఫ్‌లో కుటుంబం కోసం ఫైట్‌ చేసే యువకుడిగా కనపడతాడు. అనఘ చాలా మంచి పాత్రను పోషించింది. ఆమె అటెంప్ట్‌ను అభినందించాలి. ఇక నరేశ్‌, హేమ, కౌముది తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఆదిత్యమీనన్‌ రాధ అనే రౌడీ పాత్రనను చాలా సునాయసంగా చేసేశాడు. ఇక మహేశ్‌కి రంగస్థలం తర్వాత అలాంటి మరో పాత్ర దొరికింది. తనకు మంచి గుర్తింపును తెచ్చే పాత్ర అది. ఇక సాంకేతికంగా చూస్తే అర్జున్‌ జంధ్యాల గురువుగారి బాటలో చక్కటి యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. కేవలం హీరోయిజాన్ని కమర్షియల్‌ కోణంలో కాకుండా మంచి మెసేజ్‌ ఇచ్చే కోణంలో ఆవిష్కరించినందుకు అతన్ని అభినందించాలి. తప్పకుండా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌, యాక్షన్‌ పార్ట్‌ నచ్చుతాయి. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ అసలు బాలేదు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతంలో బుజ్జి బుజ్జి బంగారం పాట మాత్రమే బావుంది. మిగిలిన పాటలేవీ గొప్పగా లేవు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. రామ్‌రెడ్డి కెమెరాపనితనం బావుంది.

చివరగా.. మంచి మెసేజ్‌ను ఇచ్చిన 'గుణ 369'

Rating : 2.5 / 5.0