close
Choose your channels

గుణ టైటిల్ వివాదం

Thursday, May 9, 2019 • తెలుగు Comments

గుణ టైటిల్ వివాదం

క‌ళాధ‌ర్ కొక్కొండ  న‌టిస్తూ ,   స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్ , దిల్ ర‌మేష్  ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపోందుతున్న ఈ చిత్రం  ఇప్ప‌టివ‌ర‌కు   80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.. కాగా గుణ టైటిల్ ని ఆర్ఎక్స్ 100  హీరో కార్తికేయ  కొత్త సినిమాకు పెట్ట‌డం  పై  గుణ చిత్రం న‌టుడు ,ద‌ర్శ‌క‌నిర్మాత క‌ళాధ‌ర్ కొక్కొండ మండిప‌డుతున్నారు.

ఇదివ‌ర‌కే గుణ టైటిల్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు తెలిపారు.. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ .. ఆ టైటిల్ పక్కన '369' అంకెను తగిలించ‌డం పై  కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు  ఎపి ఫిల్మ్ ఛాంబ‌ర్ లో  కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు..త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని అన్నారు... 

Get Breaking News Alerts From IndiaGlitz