జనవరి 26న 'గుంటూరోడు' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,January 23 2017]

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని ఆడియో విడుద‌ల‌కు ముస్తాబైంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది.
ఈ సంద‌ర్భంగా...
చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - ''లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్ర ఆడియో ఈ నెల 26న జ‌ర‌గ‌నుంది. శ్రీ వ‌సంత్ అందించిన బాణీలు అంద‌రినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మ‌నోజ్ ఈ చిత్రంలో త‌న యాక్ష‌న్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్య ల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 26న ఆడియో విడుద‌ల చేసి, ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.
మంచు మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలలో న‌టిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

More News

కంట్రోల్ తప్పిన ప్రకాష్ రాజ్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీడియా ప్రతినిధిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.అందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే ...

ధృవ‌, శాత‌క‌ర్ణి భామ ఫ‌రా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అర‌వింద్ స్వామి ల‌వర్ పాత్ర పోషించిన న‌టి ఫ‌రా.

ఎ.పి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం యూత్ ప్లాన్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొన్ని రోజులుగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తెలుగు నేలంతా నన్నుకౌగలించుకున్నంత ఉద్వేగం - క్రిష్..!

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..?ఒక దేశాన్ని గెలిచిన గర్వం...తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం..

కాటమరాయుడు టీజర్ రిలీజ్ వాయిదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం కాటమరాయుడు.