మెగా హీరోతో ఐటం సాంగ్ చేస్తున్న హంస‌

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి సినిమాలో ఐటంసాంగ్ తో ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసానందిని. హీరోయిన్ గా అవ‌కాశాలు రాక‌పోయినా...ఐటం సాంగ్స్ కి మాత్రం అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో ఐటం సాంగ్ చేసి మ‌రింత పాపుల‌ర్ అయ్యింది హంస‌. లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగ‌ర్...ఇలా ఐటం సాంగ్స్ తో ఆక‌ట్టుకుంటున్న హంస తాజాగా మెగా హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయ‌నుంది.

ఇంత‌కీ ఆ మెగా హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? అల్లు శిరీష్. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ ఓ చిత్రం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హంస‌నందినితో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.హంస ఐటం సాంగ్ చేస్తే..సినిమా హిట్టే..మ‌రి హంస సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి అల్లు శిరీష్ స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

More News

'నేను...శైలజ' పాటలు...జనవరి 1న సినిమా విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే డ్యాన్సులు బాగుంటాయి.మొత్తం క్యారెక్టర్ డ్యాన్స్ బేస్డ్ అయితే రామ్ రెచ్చిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రేష్మి హీరోయిన్‌గా వి. సినీ స్టూడియో నూతన చిత్రం ప్రారంభం

వి. సినీ స్టూడియో పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి. దివాకర్‌ దర్శకత్వంలో 'జబర్ధస్త్‌ రేష్మి' ప్రధాన పాత్రలో 'వి. సినీ స్టూడియో' ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

హీరోయిన్ కాకుంటే ఫైలట్ అయ్యేదాన్ని - దిశా పటాని

ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా

సునీల్ హీరోగా 'ఈడు గోల్డ్ ఎహే'

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా

రోబో 2 టైటిల్ మారింది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది.