close
Choose your channels

ఐటెమ్ సాంగ్సే బెట‌రంటున్న ముద్దుగుమ్మ‌

Tuesday, May 26, 2020 • తెలుగు Comments

ఐటెమ్ సాంగ్సే బెట‌రంటున్న ముద్దుగుమ్మ‌

సినీ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టేవారంద‌రూ హీరోనో, హీరోయినో కావాల‌నే అడుగు పెడుతుంటారు. అదే కోరితో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మల్లో హంసానందిని ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో ఒక‌టి ఆరా చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి మెప్పించింది. అయితే ఆ త‌ర్వాత హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కలేదు. ఈ త‌రుణంలో అమ్మ‌డు ఐటెమ్ సాంగ్స్‌పై స్పెష‌ల్ ఫోకస్ పెట్టింది.

ప్ర‌భాస్ మిర్చి, నాగార్జున భాయ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారేది స‌హా ప‌లు చిత్రాల్లో హంసా నందిని ఐటెంసాంగ్స్‌లో న‌టించింది. కొన్ని సినిమాల్లో చిన్నా చిత‌కా వేషాలు కూడా వేసింది. అస‌లు హీరోయిన్ కావాలనుకున్న తాను.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను హంసా నందిని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరీర్‌లో త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌లు చాలానే వ‌చ్చాయి. అలాంటి పాత్ర‌ల్లో న‌టిస్తే త‌నకేం ఒర‌గ‌ద‌ని గ్ర‌హించి ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ఓకే అన్నాన‌ని హంసా నందిని చెప్పింది. పైగా డాన్స్ చేయ‌డ‌మంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని అందుక‌నే సాంగ్స్‌లో న‌ర్తించ‌డానికి తాను ఓకే అన్నాన‌ని ఈ అమ్మ‌డు సెల‌విచ్చింది.

Get Breaking News Alerts From IndiaGlitz