గోపీచంద్, సంప‌త్ నంది మూవీ లేటెస్ట్ అప్ డేట్

  • IndiaGlitz, [Monday,July 25 2016]

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. బబ్లీ బ్యూటీ హన్సిక, సరైనోడు సినిమాలో గ్లామరస్ ఎమ్మెల్యేగా సూపర్ హిట్ అందుకొన్న కేథరీన్ లు హీరోయిన్లుగా కనువిందు చేయనున్నారు. గోపీచంద్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి.

అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమా గురించి నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ...మాస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. అదే విధంగా హీరోయిన్లను తెరపై అందంగా ప్రెజంట్ చేయడంలో ఆయనది అందవేసిన చేయి.రచ్చ, బెంగాల్ టైగర్ చిత్రాల్లో తమన్నాను అందంగానే కాకుండా రోమాంచితంగానూ చిత్రీకరించిన సంపత్ నంది తాజా చిత్రంలోనూ కేథరీన్, హన్సికలను అదే తరహాలో మరింత అందంగా చూపించనున్నాడు. గోపీచంద్ మాస్ ఇమేజ్ కు ఈ అందాల భామలు తొడవ్వడంతో మాస్ ఆడియన్స్ కు ఈ చిత్రం ఓ విందు భోజనంలా ఉంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు.

ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్ః బెజ‌వాడ కోటేశ్వ‌ర‌రావు, ఎడిట‌ర్ః గౌతంరాజు, సినిమాటోగ్ర‌ఫీః ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్‌, ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: ర‌ఆమ్ ల‌క్ష్మ‌ణ్, స్క్రిప్ట్ కో ఆర్టినేటర్: సుధాకర్ పావులూరి, నిర్మాతలుః జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సంప‌త్ నంది.

More News

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లోమాయా మాల్‌

హోరా హోరీ ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం మాయా మాల్‌. ఇషా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్‌, పృథ్వీ, నాగినీడు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగణంగా న‌టించారు.

బాహుబ‌లి రికార్డ్ ను క‌బాలి బ్రేక్ చేస్తుందా..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన క‌బాలి ఓవ‌ర్ సీస్ లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

చైతు హీరోయిన్ తో విశాల్ రొమాన్స్.

మాస్ హీరో విశాల్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం పందెంకోడి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి విశాల్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది. దీంతో పందెంకోడి చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని విశాల్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

తేజు తిక్క అప్ డేట్

సాయిధ‌ర‌మ్ తేజ్, లేరిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో, హీరోయిన్స్ గా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్నతిక్క ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

నాని మూవీ రిలీజ్ డేట్‌

'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', ఇప్పుడు `జెంటిల్‌మ‌న్` ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న హీరో నాని ఇప్పుడు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.