close
Choose your channels

అయ్యో పాపం.. హ‌న్సిక‌

Wednesday, April 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో ఒక్క‌టంటే ఒక్క సినిమా లేదు కానీ త‌మిళంలో మాత్రం బిజీ హీరోయిన్‌గా మారింది హ‌న్సిక‌. గ‌త నాలుగేళ్లుగా అక్క‌డ పాగా వేసిన ఈ సుంద‌రికి ఆరంభంలో విజయాలు ద‌క్కాయి. అయితే ఈ మ‌ధ్య మాత్రం అమ్మ‌డికి కొత్త చిత్రాల ఫ‌లితాలు నిరాశ‌నే మిగులుస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వ‌చ్చిన 'క‌ళావ‌తి' త‌మిళ వెర్ష‌న్ 'అర‌ణ్‌మ‌నై 2' మిన‌హాయిస్తే ఆ త‌రువాత వ‌చ్చిన 'పోక్కిరి రాజా' గానీ, 'ఇష్క్' రీమేక్ 'ఉయిరే ఉయిరే' గానీ స‌క్సెస్‌ని అందివ్వ‌లేక‌పోయాయి.

దీంతో రెండు వ‌రుస ప‌రాజ‌యాల భారాన్ని హ‌న్సిక మోయాల్సివ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ నెలాఖ‌రులో 'ఓకే ఓకే' కోసం త‌న‌కి కలిసొచ్చిన ఉద‌య‌నిధి స్టాలిన్‌తో జ‌త‌క‌ట్టిన 'మ‌ణిద‌న్' విడుద‌ల కానుంది. ఈ సినిమా అయినా ఆమెకు హిట్‌నిస్తే స‌రి.. లేదంటే అక్క‌డ అమ్మ‌డి కెరీర్ క్లైమాక్స్‌కి చేరుకున్న‌ట్టే. అదే జ‌రిగితే హ‌న్సిక మ‌ళ్లీ టాలీవుడ్‌కి రాక త‌ప్ప‌దు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.