Hanuman:ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి 'హనుమాన్'.. జీ5 చరిత్రలోనే..

  • IndiaGlitz, [Tuesday,March 19 2024]

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ చేసిన సంగతిత తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు. అయితే సడెన్‌గా ఆదివారం జీ5లో స్ట్రీమింగ్ అయింది. దీంతో బుల్లితెర మీద కూడా అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ కరంటే ఓటీటీలోనూ అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌తో ZEE5 దూసుకెళ్తోంది.

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ మూవీగా నిలిచిన ‘హనుమాన్’ను మార్చి 17 నుంచి తమ ప్రియమైన ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేస్తోంది. వెర్సటైల్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హనుమాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్‌తో రూ.300కోట్లను సాధించిన ఈ మూవీ తమ జీ5లోనూ హిస్టరీ క్రియేట్ చేస్తుందని నిర్వాహకులు భావించారు.

నిజంగా వారి అంచనాలను మించి ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ZEE5 చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించటంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది. అంతే కాదు 2024లో జీ5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘హనుమాన్’ గ్లోబల్ ఆడియెన్స్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తుండటం విశేషం. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు..చక్కటి పాటలు ఇవన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అందుకనే పాన్ ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గర సెన్సేష‌న్ వ‌సూళ్లను రాబ‌ట్టి రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ జీ5లోనూ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.

ఇక కథ విషయానికొస్తే అంజ‌నాద్రి ప్రాంతంలో ఉండే హ‌నుమంతు (తేజ స‌జ్జ) అల్లరి చిల్లర‌గా తిరుగుతుంటాడు. త‌ల్లిదండ్రి లేని హ‌నుమంతుని అక్క అంజ‌నమ్మ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) అన్నీ తానై హ‌నుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గ‌జ‌ప‌తిని ఓ సంద‌ర్భంలో హ‌నుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయ‌టానికి వ‌చ్చిన డాక్టర్ మీనాక్షి కార‌ణంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీనాక్షిని హ‌నుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టప‌డుతుంటాడు. గ‌జ‌ప‌తి కార‌ణంగా హ‌నుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అత‌డికి ఆంజ‌నేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశ‌క్తి దొరుకుతుంది. దాంతో అత‌ను ప్రజ‌ల‌కు మంచి చేస్తుంటాడు. చివ‌ర‌కు విష‌యం విల‌న్ వ‌ర‌కు చేరుతుంది. అపూర్వ దైవ‌శ‌క్తిని సంపాదించుకోవ‌టానికి ప్రతినాయ‌కుడు ఏం చేశాడు.. అత‌న్ని మ‌న హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివ‌ర‌కు ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడి కోసం ఏం చేశాడ‌నేది చాలా చక్కగా వెండితెర మీద తెరకెక్కించారు.

More News

RS Praveen Kumar :బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఆహ్వానించిన కేసీఆర్..

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి

Kavitha:లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కీలక ప్రకటన విడుదల చేసింది.

కూటమి కథ కంచికేనా.. సభ అట్టర్ ఫ్లాప్‌తో బాబు, పవన్ ఆశలు గల్లంతు..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చాక చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రజాగళం పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే.

EC:ఈసీ సంచలన నిర్ణయం.. పలు రాష్ట్రాల అధికారులపై వేటు..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Nithin:12 ఏళ్ల తర్వాత హిట్ కాంబోలో నితిన్ సినిమా.. ఈసారి భారీగా ప్లాన్..

యువ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. చివరగా నాలుగేళ్ల క్రితం వచ్చిన 'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్నాడు.