Hanuman:హనుమాన్' సరికొత్త రికార్డ్.. ఎన్ని సెంటర్లలో 100 రోజులో తెలుసా..?

  • IndiaGlitz, [Monday,April 22 2024]

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది సంకాంత్రి కానుకగా జ‌న‌వ‌రి 12న రిలీజై రూ.300కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు 100 రోజులు, 50 రోజులు సినిమాలు ఆడేవి. ఇన్ని సెంటర్స్‌లో మా హీరో సినిమా ఆడిందని అభిమానులు గర్వంగా చెప్పకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎంత స్టార్ హీరో సినిమా అయినా ఓ రెండు వారాలు థియేటర్స్‌లో కలెక్షన్స్ రాబట్టి వెళ్లిపోతుంది.

కానీ ఈ థియేటర్ల విషయంలో కూడా హనుమాన్ సినిమా సరికొత్త రికార్డులను సెట్ చేసింది. ఇప్పటికే 300 సెంటర్స్‌లో 30 రోజులు.. 150 సెంటర్స్‌లో 50 రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా నేటితో 25 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుని ఔరా అనింపింది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మరోవైపు అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‌లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. కాగా ఈ మూవీకి ‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ సీక్వెల్ మూవీలో ఆంజనేయస్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఆంజనేయస్వామి రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని విడుదల చేశారు. ఈ మూవీలో హనుమంతు పాత్రలోనే తేజ నటిస్తుండగా.. ఆంజనేయస్వామి పాత్రలో స్టార్ హీరో నటించనున్నారు.

ఇదిలా ఉంటే తేజ సజ్జ తన తర్వాతి చిత్రాన్ని సూర్య వర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీలో సూపర్ యోధగా కనిపించనున్నాడు. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌తో పాటు గ్లింప్ల్స్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు 'మిరాయ్' (Mirai) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సూపర్ యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ మూవీ భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

More News

CM Jagan: నన్ను బచ్చా అంటున్న చంద్రబాబు పొత్తులతో ఎందుకు వస్తున్నాడు: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Revanth Reddy: మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామనేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

Chandrababu:జగన్‌ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు: చంద్రబాబు

తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Harish Shankar:చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్‌ శంకర్ వార్నింగ్

దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), కెమెరామెన్ చోటా కె నాయుడు మధ్య కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి.

ఏపీలో విజయం వైసీపీదే.. టీడీపీ అంతర్గత సమావేశం వీడియో లీక్..

ఏపీలో ఎక్కడా చూసిన వైసీపీ ప్రభంజనమే కనిపిస్తోంది. సీఎం జగన్ సభలకు జనం తాండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలతో పాటు