Hanuman:ZEE5లో సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హను-మ్యాన్’ స్ట్రీమింగ్‌

  • IndiaGlitz, [Sunday,March 17 2024]

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను స్ట్రీమింగ్ చేస్తోంది. వెర్స‌టైల్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో రూ.300 కోట్ల‌ను అందుకుంది. థియేట‌ర్స్‌లో ‘హను-మ్యాన్’ సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. అంద‌రి వెయిటింగ్‌కు జీ5 ఇప్పుడు తెర దించేసింది. ఈ ఎగ్జ‌యిటింగ్ చిత్రాన్ని ఆడియెన్స్‌కు అందిస్తోంది.

ప్ర‌పంచంలోనే తొలి సూప‌ర్ హీరో ఎవ‌రంటే వెంట‌నే వినిపించే పేరు ‘హనుమాన్’. కానీ దైవ‌శ‌క్తిని ఎదిరించేలా తాను ఎద‌గాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ త‌న‌నే సూప‌ర్ హీరోగా చూడాల‌ని భావించిన ఓ వ్య‌క్తి (విన‌య్ వ‌ర్మ‌).. కృత్రిమంగా శక్తిని సంపాదించుకునే పనుల్లో బిజీగా ఉంటాడు. అదే స‌మ‌యంలో అంజ‌నాద్రి ప్రాంతంలో ఉండే హ‌నుమంతు (తేజ స‌జ్జ‌) అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతుంటాడు. త‌ల్లిదండ్రి లేని హ‌నుమంతుని అక్క అంజ‌నమ్మ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) అన్నీ తానై హ‌నుమంతుని పెంచి పెద్ద‌చేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గ‌జ‌ప‌తిని ఓ సంద‌ర్భంలో హ‌నుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయ‌టానికి వ‌చ్చిన డాక్ట‌ర్ మీనాక్షి కార‌ణంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీనాక్షిని హ‌నుమంతు చిన్న‌ప్ప‌టి నుంచి ఇష్ట‌ప‌డుతుంటాడు. గ‌జ‌ప‌తి కార‌ణంగా హ‌నుమంతు ప్ర‌మాదంలో చిక్కుకుంటే అత‌ని ఆంజ‌నేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వ‌శ‌క్తి దొరుకుతుంది. దాంతో అత‌ను ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటాడు. చివ‌ర‌కు విష‌యం విల‌న్ వ‌ర‌కు చేరుతుంది. అపూర్వ దైవ‌శ‌క్తిని సంపాదించుకోవ‌టానికి ప్ర‌తినాయ‌కుడు ఏం చేశాడు.. అత‌న్ని మ‌న హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివ‌ర‌కు ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడి కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో ‘హను-మ్యాన్’ తెరకెక్కింది.

పాన్ ఇండియా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘హను-మ్యాన్’..జీ 5లో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది.

More News

Kavitha:కవితకు భారీ షాక్.. వారం రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు

YCP:వైసీపీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట.. సామాజిక న్యాయం అంటే ఇదే..

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేసింది.

RS Praveen Kumar :బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లోకి..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Modi:కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణ నలిగిపోతుంది.. ప్రధాని మోదీ విమర్శలు..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోతుందని ప్రధాని మోదీ వాపోయారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

Venkatesh Daughter:కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం..

దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. విక్టరీ వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం శుక్రవారం రాత్రి సింపుల్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.