దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న 'హ్యాపీ బర్త్ డే'

  • IndiaGlitz, [Sunday,September 04 2016]

చెన్నమనేని శ్రీధర్‌, జ్యోతీసేథీ, సంజన, శ్రవణ్‌ కీలక పాత్రధారులుగా శ్రీనందన్‌ మూవీస్‌ పతాకంపై ప‌ల్లెల వీరారెడ్డి(చేగువేరా) ద‌ర్శ‌క‌త్వంలో మహేష్‌ కల్లే నిర్మిస్తున్న చిత్రం 'హ్యాపీబ‌ర్త్ డే'. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ద‌స‌రా సంద‌ర్బంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
ఈ సంద‌ర్భంగా...
దర్శకుడు ప‌ల్లెల వీరారెడ్డి (చేగువేరా) మాట్లాడుతూ '' ఓ ఇంట్లో జ‌రిగిన ఓ జంట‌కు రాత్రి 8 నుండి 12 గంట‌ల స‌మ‌యంలో ఎదురైన య‌దార్ఘ‌ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న స‌స్పెన్స్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మే హ్య‌పీ బ‌ర్త్ డే. గ్రాఫిక్స్ సినిమాలో కీల‌క పాత్ర పోఫిస్తుంది. అలాగే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది'' అన్నారు.
నిర్మాత మహేష్‌ కల్లే మాట్లాడుతూ '' మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. కథ, కథనం ఆసక్తికరంగా ఉంటాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యకమ్రాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డి.టి.ఎస్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ద‌స‌రా సంద‌ర్బంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.