హ్యాపీ బర్త్ డే సాయిథరమ్ తేజ్

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా నటించిన మొద‌టి చిత్రం రేయ్ అయిన‌ప్ప‌టికీ రిలీజైంది మాత్రం పిల్లా నువ్వులేని జీవితం. ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పిల్లా నువ్వులేని జీవితం తేజుకి మంచి పేరు తీసుకువ‌చ్చింది. మేన‌మామ‌లు మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ పోలీక‌లుతో ఉన్న సాయిథ‌ర‌మ్ తేజు త‌న న‌ట‌న‌లో చిరు, ప‌వ‌న్ ల‌ను ఇమిటేట్ చేస్తూ..ప్రేక్ష‌కాభిమానుల‌ను అల‌రిస్తున్నాడు.

ఇటీవ‌ల రిలీజైన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. తేజు ఫైట్స్, డాన్స్..చేస్తుంటే ఏదో కావాల‌ని చేసిన‌ట్టు కాకుండా మంచి ఈజ్ తో చేస్తున్నాడు. అందుకే అన‌తి కాలంలోనే మాస్ ఆడియోన్స్ కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఈరోజు సాయిథ‌ర‌మ్ తేజ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తేజు న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీం పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో తేజు క్యాబ్ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుప్రీం పోస్ట‌ర్ చూస్తుంటే..రౌడీ అల్లుడు సినిమాలో చిరుని చూసిన ఫీల్ క‌లుగుతుంది. మేన‌మామ‌లకు త‌గ్గ మేన‌ల్లుడుగా దూసుకెళుతున్న సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజుకు బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గిల్ట్జ్.కామ్.

More News

స్వీటీ సింగం అందుకే చేయలేదు

బాలీవుడ్ సింగంలో అనుష్క కు ఆఫర్ వచ్చింది.అయితే ఆమె కాదనడంతో ఆ ఆఫర్ కాజల్ ను వెతుక్కుంటూ వెళ్ళింది.

చరణ్ లో మరో కోణం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బ్రూస్ లీ ద ఫైటర్’. శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మ‌హేష్..వ‌స్తున్నాడా

ఆర్య చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న డైరెక్ట‌ర్ సుకుమార్.

బ్రూస్ లీ నిడివి ఎంత‌..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య నిర్మించారు.

చిరు 151 & 152 మూవీస్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.