హ్యాపీ బర్త్ డే టు రానా..

  • IndiaGlitz, [Monday,December 14 2015]

లీడ‌ర్ సినిమాతో క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ హీరో ద‌గ్గుబాటి రానా. శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌డం విశేషం. ఇండ‌స్ట్రీలో టెక్నీషియ‌న్ గా రాణించాల‌నుకున్న రానా స‌డ‌న్ గా హీరో అయిపోయారు. అయితే తొలి చిత్రంతోనే త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు రానా. ఆత‌ర్వాత ద‌మ్ మారో ధ‌మ్, డిపార్టెమెంట్ త‌దిత‌ర హిందీ చిత్రాల్లో న‌టించి బాలీవుడ్ లో సైతం త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

ఆత‌ర్వాత తెలుగులో నా ఇష్టం, క్రిష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ చిత్రాల్లో న‌టించినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం ఆశించిన స్ధాయిలో రాలేదు. బిగ్ బ్రేక్ కోసం ఎద‌రుచూస్తున్న స‌మ‌యంలో వ‌చ్చిందే బాహుబ‌లి. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి లో భ‌ల్లాల‌దేవ‌గా రానా న‌ట‌న అద్భుతం. త‌నదైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని రానా ఒక్క తెలుగులోనే కాదు బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే బాహుబ‌లి రానా లైఫ్ నే మార్చేసింది. అలాగే గుణ శేఖ‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన రుద్ర‌మ‌దేవిలో కూడా రానా న‌టించి మెప్పించారు. రెండు భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లో న‌టించి మంచి క్రేజ్ సంపాదించిన రానా పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా బ‌ర్త్ డే బాయ్ రానాకి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గ్లిట్జ్.కామ్

More News

చిన్న చిత్రాలకు పెద్ద నిర్మాతలు సపోర్ట్ గా ఉండాలి - యం.యం.కీరవాణి

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం‘జత కలిసే’.

'సౌఖ్యం' పాటలు విడుదల

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై గోపీచంద్,రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సౌఖ్యం.ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.

రాజ్ తరుణ్ దర్శకత్వం?

రాజ్ తరుణ్ కి దర్శకత్వం చేయాలన్నది కల.అందుకే దర్శకత్వ శాఖలో పనిచేశారు.అనూహ్యంగా ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా టర్న్ అయిన రాజ్ తరుణ్ అప్పుడే మూడు హిట్లను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

'ఎక్స్ ప్రెస్ రాజా 'ఆడియో డేట్

ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుంది.మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

'అందమైన మాయ' డిసెంబర్ 19న విడుదల

విశ్వ శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై మణింద్రన్ దర్శకత్వం లో కొట్టే నాగరాజు యాదవ్ నిర్మాతగా కార్తీక్, భవ్య శ్రీ,హేమంత్ ,ఝాన్సీ మరియు శ్రుతిజ ముఖ్య పాత్రలలో నిర్మించిన చిత్రం అందమైన మాయ.