ఇటు కోతలు... అటు వాతలు


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణ సర్కారుపై మరోసారి విమర్శలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కోతలు-వాతలపైనే ఆధారపడిందన్నారు. పథకాల్లో కోతలు కోయడం.. ఉద్యోగాలకు వాతలు పెట్టడంతోనే ఈ ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు.
ఇప్పటివరకు 16వేలకు పైగా హోంగార్డులకు జీతాలివ్వలేదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు హరీశ్ రావు. జీతాలు అందక హోంగార్డుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని.. ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, రోజువారీ మెయింటెనెన్స్ కోసం అప్పులు చేసి బతుకుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి ఇదే తంతు నడుస్తోందని, మాటలు మాత్రం భారీగా చెబుతారని, చేతల్లో మాత్రం ఏం కనిపించట్లేదన్నారు. హోం గార్డులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు హరీశ్.
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి. కుర్చీ ఎక్కగానే ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని విమర్శించారు. హోమ్ గార్డులకు తక్షణం జీతాలు చెల్లించాలని, పథకాల్లో కోతలు ఆపాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com