close
Choose your channels

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్.. కేసీఆర్‌పై హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Friday, June 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్.. కేసీఆర్‌పై హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. టీఆర్ఎస్ సర్కార్ అనడం కంటే.. నాటి మంత్రి తన్నీరు హరీష్ రావు మనసుపెట్టి నిద్రాహారాలు మాని అహర్నిశలు కష్టపడి.. దగ్గరుండి చేపించిన ప్రాజెక్టు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో. ఈ నెల 21న అంటే శుక్రవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సం జరగనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ స్వయంగా అమ‌రావ‌తికి వెళ్లి సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌ను.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానించారు. అంతేకాదు.. వీరిద్దరి రాకకు గుర్తుగా వారికి గౌర‌వం ఇస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలా ఫ‌ల‌కంపై ఆ ఇద్దరి సీఎంల పేర్లు చెక్కించాలని టీఆర్ఎస్ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారని టాక్. అయితే జగన్‌కు ఈ అపూర్వ ఘట్టం ఎప్పటికీ తీపి గుర్తుగా నిలిచిపోనుందని చెప్పుకోవచ్చు.

అయితే ఈ కార్యక్రమానికి హరీష్ రావు వస్తున్నారా..? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఈ క్రమంలో హరీశ్ రావు తన ఫేస్‌బుక్ వేదికగా భావోద్వేగంగా ఓ పోస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన తన ఆనందాన్ని.. ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నానని ఈ సందర్భంగా హరీష్ ఓ వ్యాసమే రాసుకొచ్చారు.

హరీష్ పోస్ట్ యథావిథిగా...!

"గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి’ అనే ఉద్యమ ఆకాంక్షను నేర వేర్చే దిశగా ఇది బలమైన అడుగు. ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. అమరుల త్యాగాల ఫలితం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర కృషి ఫలితం. నాటి సమైక్య పాలకులు కావాలనే అంతరాష్ట్ర వివాదాల్లో చిక్కుకొనే విధంగా, నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టును డిజైన్ చేస్తే.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అపర భగీరథుడిలా.. తానే ఒక ఇంజనీర్‌గా మారి అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టును రీ-డిజైన్ చేశారు.. మహారాష్ట్రతో నెలకొన్న వివాదాన్ని స్నేహ పూర్వకంగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశారు" అని హరీష్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు..

"నిరంతరం పర్యవేక్షిస్తూ రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణంలో ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమించిన ఇంజనీర్లకు , ఉద్యోగులకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు. ఈ సన్నివేశాన్ని ఆనందబాష్పాలతో తిలకిస్తున్న తెలంగాణ రైతుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సస్యశ్యామల తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేల ఆశీస్సులు అందించాలి" అని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు హరీష్ ఈ పోస్ట్‌లో భావోద్వేగంగా తెలిపారు.

పిలుపు రాకపోతే..!

అయితే ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు హరీష్ వెళ్తారా..? లేదా..? అసలు కేసీఆర్ నుంచి ఆయనకు ఆహ్వానిం అందిందా..? లేదా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. హరీష్‌ను ఈ కార్యక్రమానికి పిలవకపోతే.. కేసీఆర్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అవుతుందని కొందరు ఆయన వీరాభిమానులు అనుకుంటున్నారట. సో.. ఒక వేళ పిలుపు వచ్చిందంటే హరీష్ వెళ్తారా..? లేకుంటే లైట్ తీసుకుంటారా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.