Revanth Reddy:హరీష్‌రావు రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదు.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

  • IndiaGlitz, [Friday,April 26 2024]

హైదరాబాద్‌లోని గన్‌ పార్క్ వద్దకు రాజీనామా లేఖతో వచ్చిన మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీనామా అంటున్న హరీష్‌రావు స్పీకర్ ఫార్మాట్‌లో లెటర్ రెడీ చేసుకోమని సవాల్ చేశారు. ప్రజలను మోసం చేయాలనుకునే ప్రతిసారీ హరీష్‌కు అమరవీరు స్థూపం గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అమరుల స్థూపం వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు.

తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని సెటైర్లు వేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని హరీష్‌కు సూచించారు. హరీష్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని విమర్శించారు. ఇప్పటికీ చెబుతున్నా నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో అన్నారు.

ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హరీష్ రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదని.. అగ్గిపెట్టె నాటకం లాగా ఆయన ఇంకో నాటకానికి తెర లేపారని విమర్శించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్‌రావు ఓ గుమాస్తా.. మాట్లాడాల్సింది ఆయన కాదని, కేసీఆర్ మాట్లాడాలన్నారు. రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్‌ను రద్దు చేస్తారా? అని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.

అంతకుముందు ఒకేసారి రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచే తప్పుకుంటానని హరీష్ సవాల్ చేశారు. అలాగే గన్‌పార్క్ వద్ద ప్రమాణం చేస్తానని... రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు. దీంతో హరీష్‌.. గన్ పార్క్ వద్దకు రాజీనామా పత్రంతో వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. రేవంత్ రాలేని పక్షంలో తన సిబ్బందితోనైనా రాజీనామా పత్రాన్ని పంపించాలని సూచించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో ప్రతి రైతుకి ఉన్న రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ విసిరారు.

More News

Jr. NTR:ఫోటోగ్రాఫర్లపై మండిపడిన జూ.ఎన్టీఆర్.. వీడియో వైరల్

‘RRR’మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో

Bhuvaneshwari:భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్‌.. డీప్ ఫేక్ అంటూ టీడీపీ ఫైర్..

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి పోటాపోటీ సభలు

Nara Bhuvaneshwari:దళితులపై బూతులతో మండిపడ్డ నారా భువనేశ్వరి.. ఆడియో వైరల్..

ఏపీ ఎన్నికలు పీక్ స్టేజ్‌కి చేరాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వాడివేడిగా జరుగుతోంది.

Avinash Reddy Mother: జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా..? సౌభాగ్యమ్మకు అవినాశ్ రెడ్డి తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రోజు ఏదో ఒక అంశంతో ఈ కేసు వార్తల్లో నిలుస్తోంది.

Sharmila:వైఎస్‌ఆర్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్ఆర్ పేరును అసలు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చలేదని..