హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. తాజాగా సిద్ది శ్రీనివాసరెడ్డి అనే జర్నలిస్ట్ విషయంలో ఆయన చూపిన శ్రద్ధ మరోసారి వార్తల్లో నిలిపింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. చాలా ప్రాబ్లమ్ అవుతోందని.. తనకు అపోలోలో బెడ్ ఇప్పించమని జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి.. హరీష్‌రావును వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

వీడియోను చూసిన హరీష్‌రావు వెంటనే పలు ఆసపత్రుల్లో వాకబు చేసి.. సికింద్రాబాద్‌లోని యశోదాలో బెడ్ ఉందని తెలియడంతో వెంటనే శ్రీనివాసరెడ్డిని అక్కడికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు రెండు మూడు గంటలకోసారి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను వాకబు చేస్తూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలన్నింటినీ వెల్లడిస్తూ శ్రీనివాస్ మరో వీడియో చేశారు. అయితే తను మొదట పోస్ట్ చేసిన వీడియోను కొందరు రాజకీయం చేశారని.. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దని మంచి ఎవరు చేసినా అంగీకరించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్న హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.

More News

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది.

నేను అందుకే ఐసోలేషన్‌లో ఉన్నా: యాంకర్ ఝాన్సీ

పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడటంతో ఇతర నటీనటులకు, యాక్టర్స్‌కూ కరోనా ఉందంటూ రూమర్స్ పెరిగిపోతున్నాయి.

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

డిజిట‌ల్ మాధ్య‌మానికి ఆడియెన్స్ నుండి ఆద‌ర‌ణ క్ర‌మంగా పెర‌గుతుంది. వెండితెర‌తో పాటు ఓటీటీ కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న టాప్‌స్టార్స్‌,

2021కి 25 కోట్ల మందికి కరోనా.. 18 లక్షల మరణాలు: ఎంఐటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి పది లక్షల మంది కరోనా బారిన పడగా..

ఆ వార్త‌ల్లో నిజం లేదట‌!!

పెద్ద స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు.