PSPK28: అలెర్ట్ అయిన టీమ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

వకీల్ సాబ్ చిత్రంతో పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మునుపటిలాగే పవన్ వకీల్ సాబ్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు. దీనితో పవన్ తదుపరి చిత్రాలపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అయ్యప్పన్ కోషియం రీమేక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు.

ఇదీ చదవండి: అందాలన్నీ చూపిస్తూ కొంటెగా సాకు చెప్పిన హెబ్బా పటేల్

ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో PSPK28 షూటింగ్ ప్రారంభమవుతుంది. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ కాంబినేషన్ ఇది. గబ్బర్ సింగ్ రిజల్ట్ కళ్ళముందు ఉండడంతో అభిమానులు ఆగలేకపోతున్నారు. దీనితో PSPK28 హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్స్ తో రచ్చ చేస్తున్నారు.

వాస్తవానికి చిత్ర యూనిట్ ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. కానీ PSPK28 టైటిల్ ఇదే అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్ తో సహా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

'వాస్తవానికి PSPK28 ఫస్ట్ లుక్, టైటిల్ ఉగాదికే విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ముచ్చటగా ఉన్నాయి. కానీ ఈ చిత్రాన్ని సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే ప్రకటిస్తాం' అని మైత్రి సంస్థ క్లారిటీ ఇచ్చింది.

దీనికి కొనసాగింపుగా హరీష్ కూడా స్పందించారు. ' దయచేసి టైటిల్ గురించి అసత్యాలు ప్రచారం చేయకండి. అసలైన టైటిల్ మిమ్మల్ని మెప్పించే విధంగా ఉంటుంది. మీకన్నా ఎక్కువ ఆతృతగా నేను ఎదురుచూస్తున్నా' అని హరీష్ శంకర్ అన్నారు.

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్, దేవిశ్రీ ముగ్గురి కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More News

అందాలన్నీ చూపిస్తూ కొంటెగా సాకు చెప్పిన హెబ్బా పటేల్

యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. హెబ్బా పటేల్ కు క్రేజ్ తీసుకువచ్చిన చిత్రం కుమారి 21ఎఫ్.

ప్రియదర్శి డెడికేషన్ కి క్లాప్స్ కొట్టాల్సిందే.. ఆ బాధ భరిస్తూ..

కొత్త తరం కమెడియన్స్ లో ప్రియదర్శి ప్రత్యేకమైన నటుడు. ప్రతి చిత్రంలోనూ ప్రియదర్శి తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు.

ఇలియానాపై బ్యాన్.. విక్రమ్ సినిమాతో గొడవ, నిర్మాత షాకింగ్ కామెంట్స్!

సౌత్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఇలియానా. పోకిరి చిత్రం తర్వాత నడుము సుందరిగా, కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.

3 భాగాలుగా కళ్యాణ్ రామ్ 'బింబిసారా'.. ఎన్టీఆర్ హెల్ప్?

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .

నవనీత్ కౌర్ కు షాక్.. క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు, ప్రమాదంలో పదవి!

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఫేక్ సర్టిఫికేట్ విషయంలో ఆమె వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.