పవన్- ప్రభాస్‌తో మూవీపై క్లారిటీ.. ఎన్టీఆర్‌కు హిట్టిస్తా!

  • IndiaGlitz, [Monday,September 16 2019]

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌లతో సినిమా చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా.. ‘వాల్మీకి’ ప్రమోషన్‌లో భాగంగా హరీశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు స్టార్లతో సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు.

ప్రభాస్, పవన్‌తో చిత్రాలపై!
‘పవన్‌తో గబ్బర్ సింగ్ 3 ఉంటుందని పుకార్లు వస్తున్నాయి.. అలా జరగాలని మీరు కోరుకోండి. నేను కూడా పవన్ కళ్యాణ్‌తో మళ్ళీ చిత్రం చేయాలనీ ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో మూవీస్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. అనేక చోట్ల ఫ్యాన్స్ అడుగుతుంటారు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమా తీయాలని మనం అనుకుంటే జరగదు, దానంతటికదే అది జరగాలంతే..’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.

అవును నిజమే..!
నితిన్ హీరోగా హిందీ చిత్రం ‘అందాదున్’ చేయాలనుకుంటున్నాను. మంచి చిత్రం చేయండి అని అందరూ నాకు సలహా ఇచ్చారు. అంతకు మించి ఈ సినిమా విషయంలో ఏమీ జరగలేదు. మహేష్ కోనేరుతో ఓ మూవీ చేస్తున్నాను.. చర్చల దశలో ఉంది. త్వరలో మూవీ చేసే అవకాశం ఉంది’ అని మాస్ డైరెక్టర్ తెలిపారు.

ఎన్టీఆర్‌కు హిట్టిచ్చి రుణం తీర్చుకుంటా!
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో ఎవరికైనా రుణపడ్డానన్న భావన కలిగిందా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఎన్టీఆర్కు తాను చాలా ఋణపడి వున్నానన్నారు. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయానని.. ఎప్పటికైనా ఆయనతో మంచి హిట్ మూవీ తీసి ఋణం తీర్చుకుంటానని హరీశ్ చెప్పారు.

More News

దిల్‌రాజుతో గొడవలపై హరీశ్ శంకర్ స్పందన

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

`RRR` బల్గేరియా షెడ్యూల్ పూర్తి

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`. దాదాపు రూ.300కోట్ల‌కుపై బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు.

‘వాల్మీకి’ వివాదం: నాకేం తెలీదు కథ మాత్రమే!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

'వాల్మీకి' పై సెన్సార్‌బోర్డుకి ఫిర్యాదు

త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా`ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రం `వాల్మీకి`. సెప్టెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది.

హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు కోలుకోలేని షాక్!

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో కోలుకోలేని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే.