రీమేక్ సినిమా చేయ‌డం లేదు: హ‌రీశ్ శంక‌ర్‌

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల మీట‌ర్ బాగా తెలిసిన నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో హ‌రీశ్ శంక‌ర్ ఒక‌డు. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో హ‌రీశ్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్ ఇండ‌స్ట్రీ హిట్ చిత్రంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం 2012లో విడుద‌లైంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా రీమేక్ అని వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై హ‌రీశ్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అంద‌రికీ క్లారిటీ ఇచ్చేశాడు. తాను ప‌వ‌న్‌తో స్ట్ర‌యిట్ సినిమానే చేస్తున్నాన‌ని, రీమేక్ సినిమా చేయ‌డం లేద‌ని అంద‌రికీ క్లారిటీ ఇచ్చేశాడు హ‌రీశ్ శంక‌ర్.

షాక్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా షాక్ తిన్న హ‌రీశ్ శంక‌ర్ త‌ర్వాత మిర‌ప‌ర‌కాయ్‌, గబ్బ‌ర్ సింగ్ సినిమాల‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాతో మ‌ళ్లీ డిజాస్ట‌ర్‌ను ఎదురుచూశాడు. త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల‌తో విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న ఫేవ‌రేట్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను హ‌రీశ్ ఎలా చూపించ‌బోతున్నాడో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

More News

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?

బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన యాక్ష‌న్ సిరీస్ ధూమ్‌.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న

నానితో హైబ్రీడ్ పిల్ల‌..?

నాని ప్ర‌స్తుతం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' గా రాబోతున్న అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది.

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

3 రాజధానులపై తేల్చేసిన కేంద్రం!

నవ్యాంధ్ర రాజధాని అమరావతినితో పాటు మరో క్యాపిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్-19న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.