డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ చేతుల మీదుగా 'సెబాస్టియ‌న్ P.C. 524' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

రాజావారు రాణిగారు చిత్రంతో చిత్ర సీమ‌కు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క‌మిట్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం. ఇప్ప‌టికే కిర‌ణ్ త‌న రెండో సినిమాగా ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం Est. 1975 లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ వారితోనే తాజాగా సెబాస్టియ‌న్ పి.సి 524 అనే ప్రాజెక్ట్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. దీంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ కాంబినేష‌న్ లో మ‌రో వినూత్న‌మైన సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కునిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం అవుత‌న్నారు. ఇది ఇలా ఉంటే కిర‌ణ్ అబ్బ‌వరం పుట్టిన రోజు(జూలై 15న‌) సంద‌ర్భంగా సెబాస్టియ‌న్ పి.సి. 524 ఫ‌స్ట్ లుక్ ని రెడీ చేసింది చిత్ర బృందం. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఈ ఫ‌స్ట్ లుక్ ని ఆన్ లైన్ లో విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ కాన్సిస్టేబుల్ గా న‌టిస్తున్నారు. ఇదే థీమ్ తో ఫ‌స్ట్ లుక్ ని సైతం చిత్ర బృందం సిద్ధం చేసింది. అలానే ఈ సినిమాలో హీరో రే చీక‌టి (నైట్ బ్లైండ్ నెస్ తో ) బాధ‌ప‌డుతుంటాడ‌నే వివ‌రాన్ని కూడా ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాకి ఎడిట‌ర్ గా విప్ల‌వ్, సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్ కే న‌ల్లి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెబాస్టియ‌న్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు తెలిపారు.

తారాగ‌ణం; కిర‌ణ్ అబ్బ‌వ‌రం