హరీష్ శంకర్ అలా ఫిక్స్ అయ్యాడు..

  • IndiaGlitz, [Friday,November 20 2015]

షాక్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..మిర‌ప‌కాయ్ సినిమాతో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. ఆత‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ తో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించి ఇండ‌స్ట్రీ ద్రుష్టిని ఆక‌ర్షించిన హ‌రీష్ శంక‌ర్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా ఫ్లాప్ అవ్వ‌డంతో వెన‌క‌బ‌డిపోయాడు. ఇటీవ‌ల మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ తో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మూవీ తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఈ సినిమా త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ బ‌న్ని తో మూవీ చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే బ‌న్ని ప్ర‌స్తుతం చేస్తున్న స‌రైనోడు సినిమా త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలియ‌డంతో హ‌రీష్ శంక‌ర్ మాస్ రాజా ర‌వితేజ తో మూవీ చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. ర‌వితేజ ప్ర‌స్తుతం ఎవ‌డో ఒక‌డు సినిమా చేస్తున్నాడు. ఆత‌ర్వాత డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కూడా ర‌వితేజ కోసం లైన్ లో ఉన్నాడు. మ‌రి..హ‌రీష్ శంక‌ర్ కి ర‌వితేజ అవ‌కాశం ఇస్తాడో..? లేదో..? ఇస్తే ఎప్పుడు ఇస్తాడో..?

More News

మరో ప్రయత్నం చేస్తున్న గౌతమ్..

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గౌతమ్ నటుడుగా మంచి మార్కులు సంపాదించినా.. ఆశించిన స్ధాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయాడు.

డిసెంబర్ 13న ఒంగోలులో 'సౌఖ్యం' ఆడియో విడుదల

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది.అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే.కుటుంబం సౌఖ్యంగా ఉండాలి.

ఆ ఇద్దరు యువ హీరోలు కలిసి నటిస్తున్నారు..

యువ హీరోలు నాగ శౌర్య, నారా రోహిత్ ఈ ఇద్దరు కలసి నటిస్తున్నారా అంటే...అవుననే అంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల నారా రోహిత్ హీరోగా జ్యోఅచ్చుతానంద అనే సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే.

'సైజ్ జీరో' తో కనెక్ట్ అవుతారట

రెండేళ్ల క్రితం విడుదలైన'వర్ణ' కోసం తొలిసారిగా జతకట్టిన ఆర్య,అనుష్క..మరోసారి 'సైజ్ జీరో' కోసం జోడీ కట్టిన సంగతి తెలిసిందే.

సావిత్రి కోసం కష్టపడుతున్న రోహిత్

నారా రోహిత్ నటిస్తున్నతాజా చిత్రం సావిత్రి. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పశ్చమ గోదావరి జిల్లా దెందులూరులో షూటింగ్ జరుపుకుంటుంది.