నేష‌న‌ల్ మీడియాపై హ‌రీశ్ శంక‌ర్ సెటైర్ !

టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ నేష‌న‌ల్ మీడియాపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. ఇంత‌కూ హ‌రీశ్ శంక‌ర్‌కు జాతీయ మీడియాపై ఎందుకు కోపం వ‌చ్చింది? అనే విష‌యంలోకి వెళితే.. గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా వైర‌స్‌తో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. బాలుపై ద‌క్షిణాది మీడియా ప్ర‌త్యేక క‌థనాలెన్నింటినో ప్ర‌సారం చేసింది. అంత‌ర్జాతీయ టీవీ ఛానెల్ బీబీసీ ఛానెల్ ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గొప్ప‌త‌నం గురించి న్యూస్‌ను ప్రెజెంట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడి.. ఎస్పీబీకి ట్విట్టర్ వేదికగా నివాళులు అందించారు. ఈ విషయాన్ని బీబీసీ ప్రస్తావిస్తూ న్యూస్‌ను టెలికాస్ట్ చేసింది. కానీ నేష‌న‌ల్ మీడియా మాత్రం పట్టించుకోలేదు.

దీనిపై హ‌రీశ్ శంక‌ర్‌కి కోపం వ‌చ్చింది. త‌న కోపాన్ని మాట‌ల రూపంలో వ్య‌క్తం చేస్తూ .. ‘‘ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు..’’ అంటూ బీబీసీ ఛానెల్లో బాలు గురించి ప్రసారమైన వార్తకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

More News

త‌న విగ్ర‌హాన్ని తానే త‌యారు చేయించుకున్న బాలు...!

గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఐదు దశాబ్దాలు.. 12 భాష‌ల్లో 40వేల‌కు పైగా పాట‌లు...

డ్రగ్స్ చాట్ చేసినట్టు అంగీకరించిన రకుల్..!

డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన విషయం తెలిసిందే.

నిశ్శ‌బ్ధం కోసం అనుష్క ఇంట‌ర్నేష‌న్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు - డైరెక్ట‌ర్ హేమంత మ‌ధుక‌ర్

పుష్ప‌క విమానం టైపులో ప్ర‌స్తుత సాంకేతిక‌ను వాడుకొని థిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఎక్స్ పెర్మెంటల్ మూవీ చేయాల‌నుకున్నా.

'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ విడుదల

గతేడాది హైదరాబాద్ శివార్లలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "దిశ ఎన్కౌంటర్".

ఒక రకంగా నేనే వారికి శాపమేమో.. ఫీలయిన ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఔన్నత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.