మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

  • IndiaGlitz, [Saturday,February 22 2020]

ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పెద్ద హిట్ సాధించాడు. మహేశ్ 26వ చిత్ర‌మిది. మహేశ్ తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు కూడా తెలిపారు. వంశీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న‌ట్లు ఈ సినిమాలో మ‌హేశ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఆగిపోయింద‌ట‌.

వంశీ త‌యారు చేసిన మాపియా బ్యాక్‌డ్రాప్ క‌థ మ‌హేశ్‌కు న‌చ్చ‌లేద‌ట‌. త్వ‌ర‌లోనే మ‌రో ద‌ర్శ‌కుడితో మ‌హేశ్ త‌న సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ని అంటున్నారు. గ‌తంలో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో మ‌హేశ్ 'మ‌హ‌ర్షి' సినిమా చేశాడు. ఈసినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ సినిమా నుండి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే అనుబంధంతో వంశీకి మ‌హేశ్ మ‌రో సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాడు. మ‌రిప్పుడేమో రెడ్ సిగ్న‌ల్ వేసేశాడ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్‌రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More News

డైరెక్టర్ గా శివ‌కు '22' సినిమా బిగ్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా - ప్ర‌భాస్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

ప్ర‌భాస్‌కు షాకిచ్చిన మోహ‌న్‌బాబు..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌కి సీనియ‌ర్ విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు షాకిచ్చారా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతుంది.

'గతం' టీజర్ రిలీజ్

విభిన్న కథాంశంతో తెలుగు తెరపై రాబోతున్న చిత్రం గతం. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వారిద్దరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారనే లైన్ తో కిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిన్న సుజనా.. నేడు రాయపాటి.. రేపెవరో!?

ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలందరి పరిస్థితి ఇప్పుడు అదెదో సామెతలాగా తయారైంది.

దేవాన్ష్‌కు ప్రేమతో.. బాలయ్య భారీ గిఫ్ట్!

తండ్రి కొడుక్కు, తాతగారు మనవడికి.. నానమ్మ మనవడికి గిఫ్ట్ రూపేణా లేదా భూముల రూపేణా ముఖ్యమైన సందర్భాల్లో గిఫ్ట్‌లుగా ఇస్తుంటారన్న విషయం తెలిసిందే.