'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో అన్నగారు దిగొచ్చారుగా..!

  • IndiaGlitz, [Friday,January 18 2019]

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సినిమా తెరకెక్కిస్తున్నాని చెప్పినప్పటి నుంచి నేటి వరకూ అన్నీ సంచలనాలే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు, ‘చంద్రబాబు’, ‘లక్ష్మీ పార్వతి’ లుక్‌లను విడుదల చేసిన ఆర్జీవీ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌‌లో పెంచేశారు. నేడు దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా మరో సంచలనానికి తెరదీసిన వర్మ.. సరిగ్గా ఈ వర్ధంతి రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌’ సినిమాలోని ఎన్టీఆర్‌‌ ఫస్ట్‌‌లుక్ రిలీజ్ చేశారు. మొదట శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్‌ లుక్‌ను విడుదల చేయానుకున్న ఆర్జీవీ కొన్ని దివ్యమైన ముహూర్తాలు లేకపోవడంతో సరిగ్గా 6:57 గంటలకు ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.

ఎన్టీఆర్ కలలో కనిపించి..  
అన్నగారు తనకు కలలో కనిపించి జనవరి 18 6:57 గంటలకు సుముహూర్తం అని చెప్పారని అందుకే ఇలా రిలీజ్ చేశానని ఆర్జీవీ ట్విట్టర్‌‌లో తెలిపారు. నం 6+5+7 = 18 మరియు 1+8 = 9 ఎన్టీఆర్‌కు పవిత్ర సంఖ్య అని ఆ ట్వీట్‌కి వర్మ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్‌కు పవిత్ర సంఖ్య 09 అని బహుశా ఆయన అభిమానులకు కూడా తెలియదేమో.

వీడియో అదుర్స్.. 
ఒక నిమిషం నిడవితో కూడిన ఫస్ట్‌లుక్ ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోలో ఉన్న నటుడి పేరు తెలియట్లేదు కానీ.. అచ్చుగుద్దినట్లుగా ఎన్టీఆర్‌ పాత్రలో ఒదిపోయారనే చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నగారు.. దివి నుంచి భువికి దిగొచ్చినట్లుగా ఉందన్నా ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఎన్టీఆర్ కుర్చీలో కూర్చోనుండగా.. ఉరుములు, మెరుపులు మెరుస్తున్నట్లుగా బ్యాంక్‌ గ్రౌండ్‌‌ మ్యూజిక్ ఉంది. ఈ ఉరుములకు నిద్రలో ఉన్న ఎన్టీఆర్ టక్కున మేల్కొని ఏం చేయాలంటూ ఆలోచిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోకు ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మళ్లీ పుట్టారు అని ఆర్జీవీ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేవలం గంట వ్యవధిలోనే లక్షకు పైచిలుకు వ్యూస్ రావడం విశేషం. మరోవైపు ఆర్జీవీ ట్వీట్‌కు.. యూ ట్యూబ్‌ వీడియోకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, సినీ ప్రియులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్‌‌ను దింపేశారు సార్.. మీలాగా సినిమా తీయడానికి ఎవరి వల్ల కాదు’ సార్ అంటూ ఆర్జీవీని అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

More News

ఇష్టం లేకున్నా ఆయ‌న కోసం ఎస్ చెప్పిన విద్యాబాల‌న్‌

రీసెంట్‌గా ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' లో బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా న‌టించిన విద్యాబాల‌న్. మ‌రో ద‌క్షిణాది సినిమాలో న‌టించ‌నుంది.

కంగ‌నా రివ‌ర్స్ వార్నింగ్‌..

సినిమా వాళ్లు బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటే పొర‌పాటే అంటుంది కంగ‌నా ర‌నౌత్‌. ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `మణిక‌ర్ణిక‌`.

ఒంటేరుకు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్

కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బద్ధశత్రువు, గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి‌‌ ఎట్టకేలకు కారెక్కేశారు.

అభిమాని కుటుంబానికి అండ‌గా నిల‌బడ్డ‌ హీరో సందీప్ కిష‌న్

అభిమానానికి ఎల్ల‌లు ఉండ‌వు. అందుక‌నే హీరోలు అభిమానుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను చూపుతూనే ఉంటారు. యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్ తొలి చిత్రం 'ప్ర‌స్థానం' నుండి అభిమాని అయిన క‌డ‌ప శ్రీను

త‌మ‌న్నా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి..

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది.