close
Choose your channels

'ఆర్ ఆర్ ఆర్' ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం కుదిరిందా?

Saturday, June 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ ఆర్ ఆర్ ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం కుదిరిందా?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `RRR`. బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అజయ్‌దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ధారి. ఇంకా సముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్ర‌మిది. కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. రెండు నిజ‌మైన క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించిన క‌ల్పిత క‌థే ఈ చిత్రం.

ఇద్ద‌రు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులకు సంబంధించిన క‌థ కావ‌డంతో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం మూడో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 30, 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.