'RRR' లో ఎన్టీఆర్‌కు ప్రేయసి చిక్కినట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్‌లో ఒకటిగా రూపొందుతోన్న చిత్రం `RRR`. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. రామ్‌చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుందనే సంగగతి తెలిసిందే. కాగా.. ఎన్టీఆర్ జతగా డైసీ ఎడ్గర్గ్ జోనస్‌ను అనుకున్నారు. కానీ, ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దాంతో యూనిట్ మరో హీరోయిన్ను తెగ వెతుకుతున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ సరసన అమెరికన్ నటి, సింగర్ ఎమ్మారాబర్ట్స్ నటించనుందట. మరి ఈ వార్తలపై `RRR` టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.