పవన్ లోని రెండు గుణాలు ఆ స్టార్స్ లోనూ ఉన్నాయట

  • IndiaGlitz, [Saturday,January 06 2018]

తెలుగులో రెండే రెండు సినిమాల్లో నటించి.. ముచ్చటగా మూడో సినిమాతో ఏకంగా పవన్ కల్యాణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తి సురేష్. అజ్ఞాతవాసి'లో కీర్తి అమాయకంగా కనిపిస్తూనే బోలెడంత కామెడీని పండించిందని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ గురించి చాలా గొప్ప‌గా చెప్పుకొచ్చింది కీర్తి.

ఈ సినిమాలో పవన్ పక్కన కలిసి నటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే.. పవన్ చాలా సరదాగా ఉంటారని, అందరినీ నవ్విస్తూ ఉంటారని.. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ పూర్తి చేసామని కీర్తి పేర్కొన్నారు. 'గ్యాంగ్' త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్‌లో.. పవన్, అజిత్, విజయ్ ఈ ముగ్గురిలో ఉండే సారూప్యత గురించి త‌మిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు, “ పవన్‌లో ఉండే రెండు గుణాలు విజయ్, అజిత్‌లోనూ ఉన్నాయి. పవన్, అజిత్ బాడీ లాంగ్వేజ్ ఒకలాగే ఉంటుంది. అలాగే పవన్, విజయ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది” అని బదులిచ్చారు. అజ్ఞాతవాసి' ఈ నెల 10న విడుద‌ల కానున్న‌ విషయం తెలిసిందే.

More News

త‌క్కువ గ్యాప్‌లో నాలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌

భాస్కరభట్ల రవికుమార్.. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో మాస్, రొమాంటిక్, మెలోడీ పాట‌ల‌కు సాహిత్యాన్ని అందించిన గీత ర‌చ‌యిత‌. కాకపోతే మాస్ పాటలే ఆయన బలం. ఈ సంక్రాంతికి విడుదల కానున్న రెండు పెద్ద సినిమాల్లో మూడు పాటలు.. ఈ రచయిత కలం నుంచి జాలువారినవే.

'జువ్వ' మోషన్ పోస్టర్ విడుదల

రంజిత్,పాలక్ లల్వానీ హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'జువ్వ'.

జూన్‌ నుంచి జయ బి. దర్శకత్వంలో కొత్త చిత్రం

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ', 'వైశాఖం' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మి&

'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ రేపు విడుదల

'దేనికైనా రెడీ','ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు

అంతా వట్టిదే అంటున్న వరుణ్ తేజ్...

మెగా కాంపౌండ్ కు చెందిన యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ..