close
Choose your channels

నీచ‌మైన మ‌గాళ్ల‌కు ఆయ‌నొక ఉదాహ‌ర‌ణ

Monday, March 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నీచ‌మైన మ‌గాళ్ల‌కు ఆయ‌నొక ఉదాహ‌ర‌ణ

సీనియ‌ర్ న‌టుడు రాధారవి న‌య‌న‌తార‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు రాధార‌విపై త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ, డిఎంకె పార్టీ పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. రాధార‌వి ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఎట్ట‌కేల‌కు న‌య‌న‌తార సోష‌ల్ మీడియా ద్వారా రాధార‌వి వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ``మ‌హిళ‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే వారికి చ‌ప్ప‌ట్లు చూసి షాకింగ్‌గా అనిపించింది.

ప్రోత్స‌హిస్తున్నంత కాలం మ‌హిళ‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. దేవుడు నాకు మంచి అవ‌కాశాల‌నే ఇస్తున్నాడు. త‌మిళ ప్ర‌జ‌లు నా ప‌నిని గుర్తించి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నాపై ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా నేను సీత‌, దెయ్యం, భార్య‌, ప్రేయ‌సి.. వంటి పాత్ర‌ల్లో న‌టిస్తాను. వినోదం పంచ‌డానికే ఇలాంటి పాత్ర‌లు చేస్తాను. నేనేంటో నా ప‌ని చెబుతుంది. న‌డిగ‌ర్ సంఘంవారు సుప్రీం కోర్టు ఆదేశాల సారం అంత‌ర్గ‌త పిర్యాదుల క‌మిటీని ఏర్పాటు చేస్తారా? నేను ఇలాంటి ప్రెస్‌నోట్స్ విడుద‌ల చేయ‌డం త‌క్కువ‌.

ముందుగా డిఎంకె అధ్య‌క్షులు స్టాలిన్‌గారికి థాంక్స్‌. ఆయ‌న వెంట‌నే స్పందించి రాధార‌విలాంటి వ్య‌క్తిని పార్టీ నుండి తొల‌గించారు. చివ‌ర‌గా నేను రాధార‌వికి ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. మీకు జ‌న్మ‌నిచ్చింది కూడా ఓ మ‌హిళే. మ‌హిళ‌ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం మ‌గ‌త‌నం అనుకుంటారు. ఇలాంటి మ‌గ‌వారి మ‌ధ్య బ్ర‌తుకుతున్న ఆడ‌వాళ్ల‌ను చూస్తుంటే జాలేస్తుంది. రాధార‌వి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన వ్య‌క్తి.. నీచ‌మైన మ‌గ‌వాళ్ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు. సినిమాల్లేక ఏం చేయాలో తెలియ‌ని పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు`` అన్నారు నయ‌న్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.