నీచ‌మైన మ‌గాళ్ల‌కు ఆయ‌నొక ఉదాహ‌ర‌ణ

  • IndiaGlitz, [Monday,March 25 2019]

సీనియ‌ర్ న‌టుడు రాధారవి న‌య‌న‌తార‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు రాధార‌విపై త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ, డిఎంకె పార్టీ పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. రాధార‌వి ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఎట్ట‌కేల‌కు న‌య‌న‌తార సోష‌ల్ మీడియా ద్వారా రాధార‌వి వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ''మ‌హిళ‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే వారికి చ‌ప్ప‌ట్లు చూసి షాకింగ్‌గా అనిపించింది.

ప్రోత్స‌హిస్తున్నంత కాలం మ‌హిళ‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. దేవుడు నాకు మంచి అవ‌కాశాల‌నే ఇస్తున్నాడు. త‌మిళ ప్ర‌జ‌లు నా ప‌నిని గుర్తించి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నాపై ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా నేను సీత‌, దెయ్యం, భార్య‌, ప్రేయ‌సి.. వంటి పాత్ర‌ల్లో న‌టిస్తాను. వినోదం పంచ‌డానికే ఇలాంటి పాత్ర‌లు చేస్తాను. నేనేంటో నా ప‌ని చెబుతుంది. న‌డిగ‌ర్ సంఘంవారు సుప్రీం కోర్టు ఆదేశాల సారం అంత‌ర్గ‌త పిర్యాదుల క‌మిటీని ఏర్పాటు చేస్తారా? నేను ఇలాంటి ప్రెస్‌నోట్స్ విడుద‌ల చేయ‌డం త‌క్కువ‌.

ముందుగా డిఎంకె అధ్య‌క్షులు స్టాలిన్‌గారికి థాంక్స్‌. ఆయ‌న వెంట‌నే స్పందించి రాధార‌విలాంటి వ్య‌క్తిని పార్టీ నుండి తొల‌గించారు. చివ‌ర‌గా నేను రాధార‌వికి ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. మీకు జ‌న్మ‌నిచ్చింది కూడా ఓ మ‌హిళే. మ‌హిళ‌ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం మ‌గ‌త‌నం అనుకుంటారు. ఇలాంటి మ‌గ‌వారి మ‌ధ్య బ్ర‌తుకుతున్న ఆడ‌వాళ్ల‌ను చూస్తుంటే జాలేస్తుంది. రాధార‌వి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన వ్య‌క్తి.. నీచ‌మైన మ‌గ‌వాళ్ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు. సినిమాల్లేక ఏం చేయాలో తెలియ‌ని పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు'' అన్నారు నయ‌న్‌.

More News

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఈసీ అనుమ‌తి

దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘ‌ట్టంతో తెర‌కెక్కిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'. లక్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన ద‌గ్గ‌రి నుండి ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రిని ఎలా కోల్పోయారు.

త‌ప్పు ఒప్పుకొన్న రాధార‌వి

ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార ప‌ట్ల రాధార‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఒక్క‌సారిగా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిప‌డింది. మ‌హిళ‌ల ప‌ట్ల వేదిక‌ల మీద అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టం త‌ప్పు అని ఖండించింది.

అ,ఆలు కూడా రాని లోకేశ్‌‌కు అగ్రతాంబూలమా!? 

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన షర్మిల లోకేశ్‌ గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌గా...

హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ను స్టార్ట్ చేశాడు.

ఐశ్వ‌ర్య గ‌ర్భ‌వ‌తి కాదు!

అందాల రాశి ఐశ్వ‌ర్య గ‌ర్భం దాల్చారా?  ఆమె మ‌రో సారి త‌ల్లి కాబోతున్నారా? అవున‌ని ఫొటోలు చెబుతుంటే, కాద‌ని ఆమె మీడియా టీమ్ చెబుతోంది.