ఆ డైరెక్ట‌ర్ తో చ‌ర‌ణ్ మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..!

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..రామ్ చ‌ర‌ణ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీతో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

చ‌ర‌ణ్ - కృష్ణ‌వంశీ కాంబినేష‌న్లో రూపొందిన గోవిందుడు అంద‌రివాడేలే చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా మంచి చిత్రంగా నిలిచింది. చ‌ర‌ణ్ కూడా త‌న‌కు న‌చ్చిన చిత్రాల్లో గోవిందుడు అంద‌రివాడేలే ఒక‌టి అని చెప్పారు. అయితే...ఇటీవ‌ల చిరంజీవి కృష్ణ‌వంశీతో చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా చేయ‌మ‌ని చెప్పార‌ని...దానికి కృష్ణ‌వంశీ కూడా ఓకే చెప్పార‌ని టాక్. సుకుమార్ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ కృష్ణ‌వంశీ తో సినిమా చేసే అవ‌కాశం ఉంది అంటున్నారు.ఇదే క‌నుక నిజ‌మైతే...ఈసారి చ‌ర‌ణ్ ని కృష్ణ‌వంశీ ఎలా చూపిస్తారో చూడాలి..!

More News

అది ఇంకొక్క‌డు తో నెర‌వేరింది - విక్ర‌మ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు,  ఐ...ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన విక్ర‌మ్ న‌టించిన తాజా చిత్రం ఇంకొక్క‌డు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టించారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల ఇజం టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై  నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.

ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`.

అభినేత్రి సెంటిమెంట్ అదిరింది..!

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.