పాయల్‌కు కాబోయే భర్త అతడే! కానీ...

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

పాయల్ రాజ్‌పుత్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా? సౌరభ్ ధింగ్రా. పాయల్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు అతడు తెలిసే వుంటాడు. హీరోయిన్‌తో ఫిల్మ్ ఫంక్షన్స్, షూటింగ్స్‌కు అటెండ్ అవుతూ వుంటాడు. హైదరాబాద్‌లో ఇద్దరు సేమ్ ఫ్లాట్‌లో స్టే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరు క్లోజ్‌గా వున్న ఫొటోలు చాలా వున్నాయి. అంతకు ముందు వీళ్ళిద్దరూ ముంబైలో వుండేవాళ్ళు. గతంలో సౌరభ్ ధింగ్రాతో మీ రిలేషన్షిప్ ఏంటని అడిగితే జస్ట్ ఫ్రెండ్ అని చెప్పేది. ఇప్పుడు సౌరభ్ నా బాయ్‌ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసింది. అతడిని పెళ్ళి చేసుంటానని చెప్పింది.

Also Read: టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్

రీసెంట్‌గా సౌరభ్ మదర్ అనితా మృతి చెందారు. కరోనా వైరస్ ప్రాణాలు బలి తీసుకుంది. అనితా మరణంతో పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా కలత చెందింది. గట్టిగా ఏడ్వాలని వుందని చెప్పుకొచ్చింది. అనితా ఆంటీతో వున్న అనుబంధం గురించి చెబుతూ, పెళ్ళి మాట బయటపెట్టింది. సౌరభ్ ధింగ్రా ఇంట్లో, మా ఇంట్లో మా రిలేషన్షిప్ గురించి తెలుసని స్పష్టం చేసింది. పాయల్ చెప్పినదాన్ని బట్టి ఇద్దరి ఇళ్ళల్లో పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు లేవు. అందరు హ్యాపీ. కానీ, ఇప్పుడు అనితా ఆంటీ మా పెళ్ళిని చూడలేదని పాయల్ బాధపడుతోంది. అదొక్కటే రిగ్రెట్ అని చెప్పింది. అంతా ఓపెన్ గా మాట్లాడింది కానీ, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందో చెప్పలేదు.

More News

తుఫానులో నటి హాట్ ఫోటోషూట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

మహారాష్ట్ర, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో టౌటే తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది.

టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ బుధవారం రిలీజయ్యింది. అది అక్కినేని నాగచైతన్యకు నచ్చింది. ఆల్రెడీ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ పెద్ద హిట్.

పవన్ సినిమాపై రూమర్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించాడు గణేష్. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి గణేష్ దూరంగా ఉంటున్నాడు.

రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు

వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు..