close
Choose your channels

ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పదే పదే పిలిచే రాహుల్ ఈయనే..!?

Friday, May 22, 2020 • తెలుగు Comments

ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పదే పదే పిలిచే రాహుల్ ఈయనే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చాలు ఎక్కువగా వినపడే పేరు రాహుల్.. రాహుల్..? ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ రాహుల్ క్వశ్చన్ వేయకుండా ఉండరు..? కేసీఆర్ కూడా హే.. నువ్ ఊరుకో రాహుల్.. అనే పేరెత్తకుండా ఉండలేరు..! ఇప్పటికీ ఎన్నిసార్లు కేసీఆర్ మీడియా మీట్ పెట్టారో అన్నింటికీ హాజరైన రాహుల్ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు.. ఆయన ప్రశ్న సరైనదైతే హే రాహుల్ ఇది మంచి ప్రశ్న జర ఆగు సమాధానం చెబుతా అంటుంటారు కేసీఆర్.. ఒకవేళ సీఎం చిరాకేసే ప్రశ్నలేస్తే మాత్రం ఇంతెత్తున రాహుల్‌పై ఎగిరి ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని తిట్టేస్తుంటారు..?. కొన్ని కొన్ని సార్లు రాహుల్.. ఇది కచ్చితంగా హైలైట్ చేయాలి సరేనా అని కేసీఆర్ చెబుతుంటారు..? ఇంతకీ ఆ రాహుల్ ఎవరు..? ఏ పత్రికకు లేదా ఏ టీవీ చానెల్‌కు చెందిన మీడియా ప్రతినిధి అతను..? అనేది కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన జనాల్లో.. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఔత్సాహికులు, నెటిజన్లల్లో మెదులుతున్న ప్రశ్న.

నిశితంగా శోధించి..

అసలు ఎవరబ్బా ఆ రాహుల్.. అస్తమాను ఎందుకు కేసీఆర్ కలవరిస్తుంటారు అని ఆయన గురించి తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇంకొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ అయితే ఏకంగా రాహుల్ గురించి ప్రత్యేక కథనాలు సైతం వండి వార్చాయి. అయితే ఆ రాహుల్ అనే వ్యక్తి ఎవరు..? రాహుల్ ఏ పత్రికకు చెందిన వ్యక్తి..? ఇంతకీ ఆయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి..? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..? అని నిశితంగా శోధించి www.indiaglitz.com ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇక ఆలస్యమెందుకు రాహుల్ గురించి తెలుసుకోండి.

ఇదీ రాహుల్ బ్యాగ్రౌండ్..!

రాహుల్ అనే ఆయన జాతీయ పత్రికల్లో మోస్ట్ పాపులర్ అయిన ‘ది హిందూ’లో సీనియర్ జర్నలిస్ట్. ఈయన మితభాషి. సొంతూరు హైదరాబాద్‌. ఇక్కడే నిజాం కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఈయన మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి ఎన్నో పత్రికల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం హిందూలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. తన పని తాను చూసుకోవడం తప్పించి మిగిలిన విషయాలను అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా పెద్దలతో పరిచయాలు.. చిన్న పెద్దా తేడా అనే లేకుండా అందర్నీ గౌరవించడం ఈయనకున్న మంచి అలవాట్లు. అయితే ఎవర్నిపడితేవారిని గుడ్డిగా నమ్మరు.. మీకోసం ఇదిగో ఫలానా చేస్తున్నా అంటే అస్సలే నమ్మరు.. అలాంటి వాటికి అస్సలే ప్రాధాన్యం ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడంభారాలకు పోవడం.. రాసుకుపూసుకుని తిరగడం అంటే రాహుల్‌కు అస్సలు ఇష్టం ఉండదు.. అలాంటి వాటికి ఆయన ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే మీడియా రంగంలో రాహుల్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉన్నారని ఆయన ఆప్తులు చెబుతుంటారు. తెలుగు జర్నలిస్టుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్‌తో పని చేసే అతి కొద్దిమంది మీడియా ప్రతినిధుల్లో ఈయన కూడా ఒకరని క్రిటిక్స్ సైతం చెబుతుంటారు. నిజాయితీ, ముక్కుసూటి తత్వం అనేది ఆయన అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని మిత్రులు చెబుతుంటారు.

పెద్దలిచ్చే ‘పెద్ద’ పోస్టులకు నో..!

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాహుల్‌కు ఆప్త మిత్రుడే. అప్పట్లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సీఎం అయ్యాక కూడా కిరణ్‌తో మంచిగానే ఉండేవారు. అంతేకాదు.. రాహుల్ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్ మీలాంటి వారు సమాచార కమిషన్‌కు కావాల్సి ఉంటది.. రండి మీకు పెద్ద పోస్ట్ ఇస్తామని కిరణ్ రెడ్డి ఆఫర్ చేసినప్పటికీ అబ్బే అస్సలు ఒప్పుకోలేదు. తాను చేస్తున్న జాబ్ తనకు చాలంతే.. అంతకుమించి అస్సలు తనకొద్దని మిన్నకుండిపోయారు. ఆయన మీడియా రంగంలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. అందరితోనూ మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఎంతమంది పెద్ద పోస్టులకు ఆఫర్ చేసిన ఆయన నోటి నుంచి సరే అనే మాట రానే రాదు.. నో అనే మాట ముందుంటుందట.

కేసీఆర్‌తో ఇలా..!

తెలంగాణ ఉద్యమం మొదలుకుని ఇప్పటి వరకూ కేసీఆర్‌కు రాహుల్ చాలా బాగా తెలుసు. ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సంబంధించిన వార్తలన్నీ దాదాపుగా ఈయనే కవర్ చేసి రాస్తుండేవారు. కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ ఇద్దరి మధ్య మరింత సత్సంబంధాలు పెరిగాయట. అలా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం.. పక్కనే హిందూ ఆఫీస్‌ ఉండటంతో ప్రతి ప్రెస్‌మీట్‌కు రాహుల్ వెళ్తుంటారు. ఒకానొక సందర్భంగా (కేసీఆర్ సీఎం అయ్యాక) ప్రగతి భవన్‌కు వెళ్తుండగా ఆఫీస్ బయటున్న రాహుల్‌ను ‘దా రాహుల్ కారులో కూర్చో వెళ్దాం’ అని పిలిచినప్పటికీ సారీ సార్.. ముందు వర్క్ ఫినిష్ చేయాలి ఆ తర్వాతే మిగతావన్నీ అని చెప్పారు. అంటే ఆయన కమిట్మెంట్ అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. హైదరాబాదీ అయిన రాహుల్‌కు కేసీఆర్ పిలిచి మరీ మంచి పోస్టింగ్ ఇవ్వాలని భావించినప్పటికీ ‘సారీ సార్.. నాకొద్దు’ అన్నారని కూడా చెబుతుంటారు. ఇదీ కేసీఆర్‌తో రాహుల్‌కు ఉన్న అనుబంధం.

రాహుల్.. రాహుల్.. రాహుల్..!

ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు అబ్బా.. రాహుల్ వస్తాడో రాడో..? ఏదైనా క్వశ్చన్ అడుగుతారో లేదో..? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో..? అన్నంతంగా ఔత్సాహికులు వేచి చూస్తున్నారు. కేసీఆర్ కూడా ఈయన పేరెత్తకుండానే ప్రెస్ మీట్ పూర్తి చేయరు. ప్రెస్ మీట్‌లో కచ్చితంగా రాహుల్ పాల్గొంటారు.. ఏదో ఒక ప్రశ్న అయితే కచ్చితంగా సంధిస్తుంటారు. అలా రాహుల్ అనే పేరు ప్రతీ సారి కేసీఆర్ పలకడంతో ఆయన పేరుకు అంత ప్రాధాన్యత వచ్చేసింది. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే రాహుల్.. అన్నంతగా పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదండోయ్.. ఈయనపై ఎన్నెన్నో కామెంట్స్ చేయడం.. ఇంకొందరైతే టిక్ టాక్‌లో కూడా వీడియోలు కూడా తెగ చేసేస్తున్నారు. మొదట ఈ రాహుల్ అనే ఎవరో తెలియక అందరూ దేవులపల్లి రాహుల్ అని ఓ యువ జర్నలిస్టు‌గా భావించారు. తీరా చూస్తే ఆయన మీడియాలో పండిపోయిన ప్రతినిధి అని తెలిసింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు.. కేసీఆర్ ఫొటోలు జతచేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇదిగోండి ఇతన్నే కేసీఆర్ సారూ అస్తమాను ప్రెస్‌మీట్‌లో కలవరించేది అని రాహుల్ ఫొటో పెట్టి మరీ కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఇదీ రాహుల్ మీడియా లైఫ్.

Get Breaking News Alerts From IndiaGlitz