close
Choose your channels

టీడీపీ ఓటమికి కారణం ‘అతనొక్కడే’

Saturday, June 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ ఓటమికి కారణం ‘అతనొక్కడే’..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ హోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ మాత్రం కేవలం 23 అసెంబ్లీ, 03 ఎంపీ స్థానాలకు పరిమితం కాగా.. జనసేన మాత్రం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. అయితే ఈ పరిస్థితికి కారణాలేంటి..? ఎందుకింత ఘోరంగా ఓడిపోయాం..? ప్రజలు వైసీపీకే ఎందుకు ఓట్లేసి గెలిపించారు.? అని టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ యోచనలో పడ్డారు. ఈ ఇద్దరూ అధినేతలు జిల్లాల బాటపట్టి కారణాలు తెలుసుకునేందుకు గాను అభ్యర్థులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో వర్క్‌షాపులు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు.. పలువురు ప్రముఖులు మాత్రం పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  

టీడీపీ ఓటమికి కారణం ఆయనే..!

తాజాగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ స్పందిస్తూ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ‘అతనొక్కడే’ కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెప్పారు. ఈ ఓటమికి కర్త, కర్మ, క్రియ జనసేనానీనే అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సుమన్ అభినందనలు తెలిపారు.

నేను పుట్టిన తర్వాత ఇదే తొలిసారి!

ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని తాను జన్మించిన తర్వాత చూడటం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్‌దే అని సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా.. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.