కోన చెప్పిన స్టార్ అత‌నేనా?

  • IndiaGlitz, [Sunday,December 30 2018]

బాలీవుడ్‌లో మినిమం బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ‌రేలీ కీ బ‌ర్ఫీ' చిత్రం ఆర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్‌, కృతిస‌న‌న్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. అశ్వినీ అయ్యర్ తివారీ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ త‌న కోన ఫిలిం కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో సంయుక్తంగా రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఓ స్టార్ హీరోను ఈ రీమేక్‌లో న‌టింప చేయాల‌నేది కోన వెంక‌ట్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంద‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. నిర్మాత‌లు చైత‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలైతే చేశార‌ట‌. చైతు కూడా సుముఖంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

బాల‌య్య వ‌ద్దంటే.. వెంకీ ఎస్ చెప్పాడా

స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చాలా కాలంగా సినిమా చేయ‌కుండా ఉన్నాడు. నిజానికి బాల‌కృష్ణ హీరోగా వినాయ‌క్ సినిమా చేయాల్సింది.

ఒత్తిడిలో ర‌ష్మిక ఏం చేస్తుందో తెలుసా?

ప‌నిలో ఎక్కువ‌గా మునిగి తేలే వారు ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఒక్కొక్క‌రు ఒక్కో రీతిన ప్ర‌వ‌ర్తిస్తుంటారు.

'మ‌జిలి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్..

నందమూరి సుహాసిని భవితవ్యంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

నందమూరి సుహాసిని.. గత ఎన్నికల ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి స్థానానికి టీడీపీ తరపున అనూహ్యంగా చంద్రబాబు ఈమెను బరిలో దింపి ఆశ్చర్యపరిచారు. 

డైరెక్టర్‌గా మ‌రోసారి..!

హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక... ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' జనవరి 25న విడుదల కాబోతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై