ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల.. ఇంకా లైఫ్ సపోర్ట్ పైనే చికిత్స

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సంబంధించిన మరో హెల్త్ బులిటెన్‌ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటికీ ఆయనకు ఐసీయూలోనే ఉంచి వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే ఆయనకు వైద్యం అందిస్తున్నట్టు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎప్పటికప్పుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది.

కాగా.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు చరణ్ కూడా ఓ ఆడియోను విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. ‘‘చాలా మంది నాన్న ఆరోగ్య విషయమై నాకు కాల్ చేస్తున్నారు. నాన్న బాగున్నారు. నిన్న ఆయనకు ఇచ్చిన ట్రీట్‌మెంట్.. వెంటిలేషన్‌పై పెట్టడం.. వంటివి బాగా సహకరించాయి. దీంతో ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నాం. త్వరలోనే నాన్న సాధారణ స్థితికి వస్తారని నమ్ముతున్నాం. నేను ఆయనకు సంబంధించిన హెల్త్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను’’ అని చరణ్ వెల్లడించారు.

ఆగస్ట్ 5వ తేదీన తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. వైద్యులు తనను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండమని సూచించారని కానీ తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. తన స్నేహితులంతా ఆసుపత్రిలోనే ఉన్నారని.. తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించారు.

More News

కీర్తి సురేష్, ఆది పినిశెట్టిల ‘గుడ్ లక్ సఖి’ టీజర్ విడుదల

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం.. ‘గుడ్ లక్ సఖి’.

ఏయ్ రెడ్డీస్.. నన్ను రెచ్చగొడితే.. గూబ పగిలిపోద్ది: రఘురామరాజు

తనను ఫోన్‌లో బెదిరిస్తున్న వారిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మువ్వన్నెల జెండా సాక్షిగా రాజధానులపై మాట్లాడిన జగన్

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినంతగా సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయమై మాట్లాడరు.

వదంతులను నమ్మకండి.. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి, కుమారుడు క్లారిటీ ఇచ్చారు.

బాలు.. త్వరగా లేచిరా!  నీ కోసం కాచుకుని కూర్చున్నాను:  ఇళ‌య‌రాజా

గానగంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోవిడ్ 19 కార‌ణంగా ఆగ‌స్ట్ 5న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే.