హెబ్బాకి ఆ సెంటిమెంట్ క‌లిసి రాలేదు

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

త‌క్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. అలా ఎలా అనే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ మ‌ద్దుగుమ్మ‌.. కుమారి 21 ఎఫ్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఆ త‌రువాత హెబ్బా క‌థానాయిక‌గా న‌టించిన సినిమాల్లో ఈడో ర‌కం ఆడో ర‌కం, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా కూడా మంచి విజ‌యం సాధించాయి.

అయితే ఆ త‌రువాత మాత్రం హెబ్బాకి వ‌రుస ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఈ ఏడాది అయితే మిస్ట‌ర్‌, అంధ‌గాడుతో పాటు తాజాగా వ‌చ్చిన ఏంజెల్ చిత్రం కూడా ఫ్లాప్ బాట ప‌ట్టాయి. విశేష‌మేమిటంటే.. ఏంజెల్ చిత్రం హెబ్బాకి క‌లిసొచ్చే న‌వంబ‌ర్‌లోనే విడుద‌లైంది.

2014లో అలా ఎలా.. 2015లో కుమారి 21 ఎఫ్‌.. 2016లో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. చిత్రాల‌తో న‌వంబ‌ర్ లో హెబ్బా సినిమా వ‌స్తే అది హిట్టే అనే సెంటిమెంట్ ప‌డింది. అయితే ఏంజెల్ విష‌యంలో అది కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. పాపం.. హెబ్బా ప‌టేల్‌!

More News

నవంబర్ 9న సువర్ణ సుందరి టీజర్

గత కొంత కాలంగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల నిర్మాణం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలొ కాస్త ఎక్కువగానే కన్పిస్తొంది. స్టార్ హీరో హీరోయిన్ లు కూడా రోటీన్ కి భిన్నంగా, తమ క్యారక్టరైజేషన్ కంటే  కధ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

మ‌ల‌యాళంలోకి వ‌రుణ్‌తేజ్‌...

మెగా క్యాంప్ హీరోల‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేర‌ళ‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌, అల్లుఅర్జున్ సినిమాలు మ‌ల‌యాళంలోని అనువాద‌మై విడుద‌ల‌వుతుంటాయి.

కేసు క్లియ‌ర్‌..24న జూలీ వ‌చ్చేస్తుంది..

రాయ్ ల‌క్ష్మీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జూలీ 2'. ఈ సినిమాను దీపిక్ శివ్‌స‌దాని తెర‌కెక్కించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. దీప‌క్‌నాయ‌ర్‌, ప‌హ‌ల‌జ్ నిహ్‌లానీ నిర్మాత‌లు.

సెల‌బ్రిటీల చేతుల మీదుగా హోట‌ల్ ద‌స‌ప‌ల్లా లో క్రిస్మ‌స్ కేక్ మిక్సింగ్

హైద‌రాబాద్ సిటీలో నెల‌రోజుల‌కు ముందుగానే క్రిస్మ‌స్ సంబురాలు మొద‌లైపోయాయి. ట్రెడీష‌న‌ల్ క‌ల్చ‌ర్ తో క్రిస్మ‌స్ వేడుక కూడా కొత్త పుంత‌లు తొక్కుతోంది. విదేశాల్లో ఈ క‌ల్చ‌ర్ అనాటి కాలం నుంచే ఉన్నా..భార‌త‌దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్త క‌ల్చ‌ర్ వ‌స్తోంది.

గ‌రుడ వేగ అంకుశం క‌న్నా పెద్ద హిట్ : స‌క్సెస్ మీట్ లో రాజ‌శేఖ‌ర్

రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై తెర‌కెక్కిన 'పీఎస్‌వీ గ‌రుడ వేగ 123.18ఎం' శుక్ర‌వారం విడుద‌లై విజ‌యందిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.